te_tn_old/jhn/17/intro.md

2.4 KiB

యోహాను సువార్త 17వ అధ్యాయంలోని సాధారణ గమనికలు

నిర్మాణం మరియు క్రమపరచుట

ఈ అధ్యాయము ఒక దీర్ఘ ప్రార్థనను రూపొందిస్తుంది.

ఈ అధ్యాయములోని ప్రత్యేక అంశాలు

మహిమ

దేవుని మహిమను గొప్ప అద్భుతమైన వెలుగు అని లేఖనం తరచుగా చెప్పుచున్నది. ప్రజలు ఈ వెలుగును చూసినప్పుడు భయాక్రాంతులు అవుతారు. ఈ అధ్యాయములో యేసు తన శిష్యులకు తన నిజమైన మహిమను చూపించమని దేవునిని అడుగుతాడు. (యోహాను సువార్త 17:1).

యేసు శాశ్వతమైనవాడు

దేవుడు లోకమును సృష్టించే ముందే యేసు ఉన్నారు (యోహాను సువార్త 17:5). యోహాను దీని గురించి యోహాను సువార్త 1:1లో వ్రాసాడు.

ఈ అధ్యాయములో ఇతర తర్జుమా ఇబ్బందులు

ప్రార్థన

యేసు దేవుని ఏకైక కుమారుడు (యోహాను సువార్త 3:16), కాబట్టి ఆయన ఇతరులు ప్రార్థించే విధానం కంటే భిన్నంగా ప్రార్థన చేయగలడు. ఆయన ఆజ్ఞలవలే అనిపించే అనేక మాటలను ఉపయోగించాడు. మీ అనువాదం యేసును తన తండ్రి పట్ల ప్రేమతో, గౌరవముతో మాట్లాడే కుమారునివలె ఉండాలి మరియు మీరు ఏమి చేస్తే తండ్రి సంతోషంగా ఉంటాడని ఆయనకు చెప్పాలి.