te_tn/jhn/12/intro.md

6.8 KiB

యోహాను 12 సాధారణ వ్యాఖ్యలు

నిర్మాణము మరియు ఆకృతీకరణ

చదవడానికి సుళువుగా ఉండడానికి కొన్ని అనువాదాలలో కవిత్వంయొక్క ప్రతి పంక్తిని కుడివైపుకు పదాలను కూర్చుతారు. యుఎల్.టి(ULT) అనేది 12:38 మరియు 40లలో గల పాతనిబంధనలోని వచనాలను ఆ విధంగా చేసింది.

16వ వచనం ఈ సందర్భాలకు వ్యాఖ్యానంగా ఉంది. కథ యొక్క కథాంశంనుండి పదాలను వేరుచేయడానికి ఈ పద్యం క్రమపరచడంలో సాధ్యం అవుతుంది.

ఈ అధ్యయంలోని ప్రధాన అంశం

మరియ యేసు పాదాలను అభిషేకించడం

యూదులు ఒక వ్యక్తిని స్వాగతించడానికి లేదా ఆదరించడానికి గుర్తుగా వారి తలపైన నూనెను పూస్తారు.వారు ఆ నూనెను వ్యక్తి చనిపోయిన తరువాత సమాధిచేయబడకమునుపు కూడా వారి దేహానికి పూస్తారు.అయితే వారు ఎప్పుడూ వ్యక్తియొక్క పాదాలకు పూయాలని తలంచరు ఎందుకంటే వారు వారి పాదాలు మురికిగా వుంటాయి అని భావిస్తారు.

గాడిద మరియు గాడిదపిల్ల

యేసు ఒక జంతువుపైన యెరూషలేము అంతా సంచరించాడు.ఆయన యుద్ధమును జయించిన రాజు పట్టణమునకు తిరిగివచ్చినట్లుగా ఉన్నాడు.పాతనిబంధన కాలంలోని ఇశ్రాయేలు రాజులు కూడా గాడిదలమీద సంచరించారు.మిగిలిన రాజులు గుర్రాలపైన సంచరించారు.యేసు కూడా ఇక్కడ తానుకూడా ఇశ్రాయేలు రాజుననీ, ఇతర రాజులవలె కానని చూపించాడు.

మత్తయి, మార్కు, లూకా మరియు యోహాను అందరు కూడా ఈ సంఘటనను గురించి రాశారు.మత్తయి మరియు మార్కు యేసు శిష్యులు ఆయనకొరకు గాడిద తెచ్చినట్టుగా రాశారు.యోహాను యేసే గాడిదను కనుగొన్నట్టుగా రాశాడు. లూకా అతనికొరకు వారు గాడిదపిల్లను తెచ్చినట్టుగా రాశాడు. మత్తయి మాత్రమే అక్కడ గాడిద మరియు గాడిదపిల్ల రెండు ఉన్నట్టుగా రాశాడు.అయితే యేసు గాడిదపైన ఎక్కాడో గాడిదపిల్ల పైన ఎక్కాడో ఎవరికీ స్పష్టంగా తెలియదు. యుఎల్.టి(ULT)లో వారు సరిగ్గా ఏమి జరిగిందో చెప్పేప్రయత్నం లేకుండా చూపించిన విధంగా మనము కూడా ఈ సందర్భాన్ని అనువదించడం మంచిది. (చూడండి: మత్తయి 21:1-7 మరియు మార్కు 11:1-7 మరియు లూకా 19:29-36 మరియు యోహాను 12:14-15)

మహిమ

వాక్యము తరచుగా దేవుని మహిమ గొప్పదనీ,అద్భుతమైన వెలుగనీ మాట్లాడుతుంది.ఈ అధ్యాయములో యోహాను యేసు పునరుత్థానంలో గల దేవుని మహిమను గురించి మాట్లాడుతున్నాడు(యోహాను 12:16).

ఈ అధ్యాయమునందు గల ముఖ్యమైన ప్రసంగ గణాంకాలు

వెలుగు మరియు చీకటి యొక్క పర్యాయపదాలు

బైబిలు తరచుగా దేవునికి ఇష్టకరముగా ఉండక, చీకటిలో నడుస్తూవుండే అనీతిమంతులైన వారి గురించి మాట్లాడుతుంది. ఇది పాపమునుండి ప్రజలు నీతిమంతులుగా, వారు చేస్తున్నది తప్పు అని తెలుసుకొనడానికి, మరియు దేవునికి విధేయత చూపించడానికి ప్రారంభించడానికి అనుమతిస్తుంది. (చూడండి:[[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///tw/dict/bible/kt/righteous]])

ఈ అధ్యాయములోని ఇతర సాధారణ అనువాదపు ఆటంకాలు

అసంభవము

అసంభవము అనగా ఏదైనా అసాధ్యమైన దానిని వివరించడానికి చూపించే సత్యమైన వివరణ. 12:25లో మనకు ఈ అసంభవము తెలుస్తుంది”ఎవరైతే తన ప్రాణమును ప్రేమిస్తాడో వాడు దానిని పోగొట్టుకుంటాడు; అయితే ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషిస్తాడో వాడు నిత్యజీవం కొరకు దానిని భద్రంచేసుకుంటాడు.” అయితే యేసు 12:26లో ఒక మనిషి జీవితాన్ని నిత్యమైనదిగా ఎలా ఉంచుకోవాలో వివరించాడు. (యోహాను 12:25-26).