te_tn_old/mrk/09/intro.md

4.3 KiB

మార్కు సువార్త 09వ అధ్యాయములోని సాధారణ గమనికలు

ఈ అధ్యాయములోని ప్రత్యేక అంశములు

“రూపాంతరం”

దేవుని మహిమను అద్భుతమైన వెలుగుగా లేఖనం తరచుగా మాట్లాడుతుంది. ప్రజలు ఈ వెలుగును చూసినప్పుడు భయపడతారు. యేసు నిజంగా దేవుని కుమారుడని ఆయన అనుచరులు చూడగలిగేలా యేసు వస్త్రములు ఈ అధ్బుతమైన వెలుగుతో ప్రకాశించాయని మార్కు ఈ అధ్యాయములో చెప్పాడు. అదే సమయంలో, యేసు వారి కుమారుడు అని దేవుడు వారికి చెప్పాడు. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/glory]] మరియు [[rc:///tw/dict/bible/kt/fear]])

ఈ అధ్యాయములోని ముఖ్యమైన భాషీయములు

అతిశయోక్తి

తన అనుచరులు అక్షరాల అర్థం చేసుకుంటారని తానూ ఉహించని విషయాలను యేసు చెప్పాడు. “మీ చేయి మీరు పొరపాట్లు చేయుటకు కారణమైతే దానిని కత్తరించండి” (మార్కు 9:43) అని చెప్పినప్పుడు అతను అతిశయోక్తి చేస్తున్నాడు, వారు ప్రేమించిన లేక వారు అవసరమని అనుకున్న పాపానికి కారణమైయ్యే దేనికైనా దూరంగా ఉండాలి అని అందువలన వారు తెలుసుకుంటారు.

ఈ అధ్యాయములో ఇతర తర్జుమా ఇబ్బందులు

ఏలియా మరియు మోషే

ఏలీయా మరియు మోషే ఆకస్మాత్తుగా యేసు, యాకోబు, యోహాను, పేతురులకు కనిపిస్తారు తరువాత వారు అదృశ్యమవుతారు. ఆ నలుగురు ఏలియా మరియు మోషేలను చూసారు, మరియు ఏలియా మరియు మోషే యేసుతో మాట్లాడినందున ఏలియా మరియు మోషే శారీరికంగా కనిపించారని చదువరి అర్థం చేసుకోవాలి

“మనుష్యకుమారుడు”

ఈ అధ్యాయములో తనను తానూ “మనుష్యకుమారుడు” అని చెప్పుకున్నాడు. (మార్కు 9:31). మీ భాష వారు వేరొకరిలాగా మాట్లాడుతున్నట్లుగా తనను తానూ మాట్లాడుటకు అనుమతించక పోవచ్చు. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/sonofman]] మరియు [[rc:///ta/man/translate/figs-123person]])

ధర్మశాస్త్రవిద్ధమైన

ధర్మశాస్త్రవిరుద్ధం లేదా వైపరీత్యం అనేది అసలైన దానిని వివరించుటకు కనిపించే నిజమైన ప్రకటనయైయున్నది. ఎవరైనా మొదటివారిగా ఉండాలనికుంటే, అతను అందరికి చివరివాడు మరియు సేవకుడు” అని చెప్పినప్పుడు యేసు ఒక శాస్త్ర విరుద్ధమైన మాటను ఉపయోగిస్తాడు. (మార్కు 9:35).