te_tn_old/luk/06/intro.md

7.2 KiB

లూకా 06 సాధారణ వివరణ

నిర్మాణం, రూపం

లూకా 6:20-49 వచనభాగం మత్తయి 5-7కి అనుగుణంగా కనిపించే అనేక ఆశీర్వాదాలూ, దుఃఖాలను కలిగి ఉంది. మత్తయి సువార్తలోని ఈ భాగాన్ని సాంప్రదాయకంగా ""కొండ మీద ప్రసంగం"" అని పిలుస్తారు. లూకా సువార్తలో ఆ వచనాలు మత్తయి సువార్తలో ఉన్నట్లుగా దేవుని రాజ్యముపై ఉన్న బోధనతో అనుసంధానించబడలేదు. (చూడండి: rc://*/tw/dict/bible/kt/kingdomofgod)

ఈ అధ్యాయంలోని ప్రత్యేక అంశాలు

""ధాన్యాన్ని తినడం""

శిష్యులు విశ్రాంతి దినంలో నడుస్తూ పొలంలో ధాన్యాన్ని తుంచి తినినప్పుడు (లూకా 6: 1), వారు మోషే ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తున్నారని పరిసయ్యులు చెప్పారు. శిష్యులు ధాన్యం తీయడం ద్వారా పని చేస్తున్నారని, విశ్రాంతి తీసుకోవడం, విశ్రాంతి రోజున పని చేయవద్దని చెప్పిన దేవుని ఆజ్ఞను ధిక్కరించారని పరిసయ్యులు చెప్పారు.

శిష్యులు దొంగిలించారని పరిసయ్యులు అనుకోలేదు. ఎందుకంటే మోషే ధర్మశాస్త్రం ప్రకారం ప్రయాణికులు తాము ప్రయాణించేటప్పుడుగానీ లేక వాటిని సమీపించేటప్పుడు గానీ పొలాల్లోని మొక్కల నుండి చిన్న మొత్తంలో ధాన్యాన్ని తెంపి తినడానికి వ్యవసాయకులు అనుమతించవలసి ఉంది. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/lawofmoses]])మరియు [[rc:///tw/dict/bible/kt/works]]మరియు rc://*/tw/dict/bible/kt/sabbath)

ఈ అధ్యాయంలో సందేశంలోని ముఖ్యమైన రూపాలు

రూపకం

రూపకాలు అంటే అదృశ్య సత్యాలను వివరించడానికి ఉపదేశకులు ఉపయోగించే దృశ్య వస్తువుల చిత్రాలు. యేసు తన మనుషులు ఉదారంగా ఉండాలని నేర్పించడానికి ఉదారంగా ఉన్న ​​ధాన్యం వ్యాపారి రూపకాన్ని ఉపయోగించాడు (లూకా 6:38). (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

అలంకారిక ప్రశ్నలు

అలంకారిక ప్రశ్నలు అంటే బోధకునికి ఇంతకుముందే సమాధానం తెలిసిన ప్రశ్నలు. యేసు విశ్రాంతి దినాన్ని మీరుతున్నాడని భావించినప్పుడు పరిసయ్యులు యేసును అలంకారిక ప్రశ్న అడగడం ద్వారా ఆయనను నిందిస్తున్నారు. ([లూకా 6:2] (../../luk/06/02.md). (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

ఈ అధ్యాయంలో సాధ్యమయ్యే ఇతర అనువాద ఇబ్బందులు

అంతర్భాగ సమాచారం

బోధకులు తమ సందేశాలను వినేవారు ఇప్పటికే అర్థం చేసుకున్నారని భావించే విషయాలు సాధారణంగా చెప్పరు. శిష్యులు తమ చేతుల మధ్య ధాన్యం కంకులను తుంచుతున్నారని లూకా రాసినప్పుడు, వారు తినే భాగాన్ని వారు విసిరి పారవేసే వాటి నుండి తినేవాటిని వేరు చేస్తున్నారని తన పాఠకులకు తెలుస్తుందని అతను ఊహించాడు. (లూకా 6:1). (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

పన్నెండు మంది శిష్యులు.

శిష్యుల జాబితా ఈ క్రింది విధంగా ఉంది:

మత్తయి సువార్తలో:

సీమోను (పేతురు), అంద్రెయ, జెబదయ కుమారులు యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, మత్తయి, అల్ఫయి కుమారుడు యోకోబు, తద్దయి, జెలోతీయుడైన సీమోను, యూదా ఇస్కరియోతు

. మార్కు సువార్తలో:

సీమోను (పేతురు), అంద్రెయ జెబదయ కుమారుడైన యాకోబు, జెబదయి కుమారుడైన యోహాను (వీరిద్దరికి యేసు బోయెనెర్గెసు అనే పేరు పెట్టాడు. అంటే ఉరిమెడు వారు అని అర్థం), ఫిలిప్పు, బర్తలొమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడైన యాకోబు, సీమోను (జెలోతె అని పిలువబడినవాడు), యాకోబు కుమారుడు యూదా, యూదా ఇస్కరియోతు యూదా.

లూకా సువార్తలో:

సీమోను (పేతురు), అంద్రెయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలొమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడైన యాకోబు, సీమోను (జెలోతె అని పిలువబడినవాడు), యాకోబు కుమారుడు యూదా, మరియు, యూదా ఇస్కరియోతు

తద్దయి బహుశా యాకోబు కుమారుడు యూదాలా ఒకే వ్యక్తి కావచ్చును.