te_tn_old/mat/10/39.md

24 lines
3.2 KiB
Markdown
Raw Normal View History

2020-12-28 23:05:29 +00:00
# He who finds his life will lose it. But he who loses ... will find it
యేసు తన శిష్యులకు బోధించడానికి ఒక సామెత ఉపయోగిస్తున్నాడు. దీన్ని సాధ్యమైనంత తక్కువ మాటల్లో తర్జుమా చెయ్యండి. ప్రత్యామ్నాయ అనువాదం: ""తమ ప్రాణం అంటిపెట్టుకుని ఉండేవారు దాన్ని పోగొట్టుకుంటారు. కానీ తమ ప్రాణాలు పోగొట్టుకునే వారు దాన్ని దక్కించుకుంటారు.” లేక “నీవు నీ ప్రాణం కోసం చూస్తే దాన్ని పొగొట్టుకుంటావు. కానీ దాన్ని పోగొట్టుకుంటే దాన్ని కనుగొంటావు."" (చూడండి: [[rc://*/ta/man/translate/writing-proverbs]])
# finds
ఇది రూపకఅలంకారం. “అంటిపెట్టుకోవడం” లేక “రక్షించుకోవడం"" అనే అర్థంతో వాడారు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఉంచుకోవడానికి ప్రయత్నిస్తే” లేక “రక్షించుకోడానికి ప్రయత్నిస్తే"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# will lose it
అంటే ఆ వ్యక్తి చనిపోవాలని కాదు. ఇది ఒక రూపకఅలంకారం. అంటే అతడు దేవుని ఆధ్యాత్మిక జీవం అనుభవించలేడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నిజ జీవం ఉండదు."" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# who loses his life
ఇది చనిపోవడం అని కాదు. ఇది ఒక రూపకఅలంకారం. అంటే ఒక వ్యక్తి తన జీవం కన్నా యేసుకు విధేయత చూపడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రత్యామ్నాయ అనువాదం: ""తనను నిరాకరించుకునే వాడు."" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# for my sake
2020-12-29 16:52:57 +00:00
నాపై నమ్మకం ఉంచినందుకు లేక “నా మూలంగా” లేక “నా కారణంగా."" [మత్తయి 10:18]లో ఉన్న ""నా కోసం"" అనేదే ఇదికూడా.(../10/18.md).
2020-12-28 23:05:29 +00:00
# will find it
ఈ రూపకఅలంకారం అర్థం ఒక వ్యక్తి దేవునితో ఆధ్యాత్మిక జీవం అనుభవిస్తాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నిజ జీవం కనుగొంటాడు."" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])