te_tn/mat/13/intro.md

4.1 KiB

మత్తయి 13 సాధారణ నోట్సు

నిర్మాణము, పరిమాణము

కొన్ని కొన్ని అనువాదాలు చదవడానికి వీలుగా పద్య భాగాన్ని కొంచెం కుడి వైపుకు ముద్రిస్తాయి. ULT లో కూడా పాత నిబంధన నుండి ఎత్తి రాసిన వచనాలు ఇలానే కనిపిస్తాయి. 13:14-15, లో కనిపించే మాటలు పాత నిబంధన నుండి తీసుకున్నవి.

ఈ అధ్యాయంలో కొత్త భాగం మొదలౌతున్నది. ఇందులో యేసు దేవుని రాజ్యం గురించి చెప్పిన ఉపమానాలు ఉన్నాయి.

ఈ అధ్యాయంలో ప్రాముఖ్యమైన భాషాలంకారం

అన్యాపదేశం

యేసు తన శ్రోతలు పరలోకంలో ఉన్న దేవుణ్ణి గురించి ఆలోచించాలంటే తరచుగా ""పరలోకం"" అనే పదం ఉపయోగించాడు. (మత్తయి 13:11).

అంతర్గత సమాచారం

మాట్లాడే వారు సాధారణంగా తమ శ్రోతలకు ఇంతకు ముందే తెలుసనుకున్న వాటిని చెప్పరు. యేసు ""సరస్సు ఒడ్డున"" కూర్చున్నాడని మత్తయి రాసినప్పుడు (మత్తయి 13:1), బహుశా తన శ్రోతలకు యేసు జనసమూహాలకు బోధిస్తున్న సంగతి తెలుసని భావించాడు.(చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

రూపకఅలంకారం

మాట్లాడే వారు తరచుగా తాకి చూడలేని వాటి గురించి చెప్పడానికి తాకి చూడగలిగిన వాటిని చెబుతారు. యేసు ఒక పక్షి విత్తనాలు తినడం అనే దాన్ని సాతాను మనుషులను యేసు సందేశం అర్థం చేసుకోకుండా చేసేదానికి సూచనగా వినియోగిస్తున్నాడు. (మత్తయి 13:19).

ఇంకా ఇలా కూడా అనువాదం చెయ్యవచ్చు. ఈ అధ్యాయంలో సమస్యలు

కర్మణి వాక్యం

ఈ అధ్యాయంలో అనేక వాక్యాలు ఒక వ్యక్తి చెబుతున్నాడు. తాను అలా జరిగేలా చేసానని చెప్పకుండా తనకు అవి జరిగాయని చెబుతున్నాడు. ఉదాహరణకు, ""అవి ఎండిపోయాయి"" (మత్తయి 13:6). దీన్ని ఎవరు చేసారో పాఠకునికి తెలిసేలా ఈ వాక్యం తర్జుమా చెయ్యవచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

ఉపమానాలు

ఉపమానాలు అంటే చిన్న కథలు. యేసు తాను బోధిస్తున్న సందేశాన్ని మనుషులు తేలికగా అర్థం చేసుకునేందుకు ఉపయోగించాడు. నమ్మని వారు సత్యాన్ని అర్థం చేసుకోకుండా ఉండడానికి కూడా అయన ఈ కథలు చెప్పాడు. మత్తయి 13:11-13).