te_tn/jhn/07/intro.md

4.6 KiB

యోహాను సువార్త 07వ అధ్యాయంలోని సాధారణ గమనికలు

నిర్మాణం మరియు క్రమపరచుట

ఈ అధ్యాయం మొత్తం యేసును మెస్సియగా విశ్వసించే భావనకు సంభందించినది. కొంతమంది ఇది నిజమని నమ్ముతారు, మరికొందరు దీనిని తిరస్కరిస్తారు. కొందరు ఆయన శక్తిని మరియు ఆయన ప్రవక్త అనే అవకాశం ఉందని గుర్తించడానికి సిద్దంగా ఉన్నారు. కాని చాలా మంది ఆయన మెస్సియ అని నమ్మడానికి ఇష్టపడలేదు. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/christ]] మరియు [[rc:///tw/dict/bible/kt/prophet]])

7:53-8:11 వచనాలను తర్జుమా చేయకూడదని వారు ఎందుకు ఎంచుకున్నారో లేక ఎన్నుకున్నారో చదవరులకు వివరించడానికి అనువాదకులు 53వ వచనంలో ఒక గమనికను చేర్చాలని అనుకోవచ్చు.

ఈ అధ్యాయములోని ప్రత్యేక అంశాలు

“నా సమయము ఇంకను రాలేదు”

ఈ వాక్య భాగం మరియు “ఆయన సమయము ఇంకా రాలేదు” అనేది యేసు తన జీవితంలో జరుగుతున్న సంఘటనల నియంత్రణలో ఉన్నట్లు సూచిస్తుంది.

“జీవ జలం”

ఇది క్రొత్తనిబంధనలో ఉపయోగించిన భావనయైయున్నది. ఇది ఒక రూపకఅలంకారమైయున్నది. ఈ రూపకఅలంకారము ఎడారి వాతావరణంలో ఇవ్వబడినందున యేసు జీవమునకు ఆహారం ఇవ్వగలడని ఇది నొక్కి చేపుతుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

ఈ అధ్యాయములోని ముఖ్యమైన భాషీయములు

ప్రవచనము

యోహాను 7:33-34.

వ్యంగం

నీకొదేము వారి గురించి తీర్పు చెప్పే ముందు ఒక వ్యక్తి నుండి నేరుగా వినాలని ధర్మశాస్త్రం కోరుతుందని ఇతర పరిసయ్యులకు వివరిస్తున్నాడు. పరిసయ్యులు యేసుతో మాట్లాడకుండా యేసు గురించి తీర్పు ఇచ్చారు.

ఈ అధ్యాయములో ఇతర తర్జుమా ఇబ్బందులు

“ఆయనను నమ్మలేదు”

యేసు సహోదరులు యేసు మెస్సియ అని నమ్మలేదు. (చూడండి: rc://*/tw/dict/bible/kt/believe)

“యూదులు”

ఈ మాటను ఈ వాక్య భాగంలో రెండు రకాలుగా ఉపయోగిస్తారు. ఆయనను చంపడానికి ప్రయత్నిస్తున్న యూదు నాయకుల వ్యతిరేకతను తెలియచేయుటకు ఇది ప్రత్యేకంగా ఉపయోగించబడింది (యోహాను సువార్త 7:1). యేసు పట్ల సానుకూల అభిప్రాయం ఉన్న యూద ప్రజలను గురించి కూడా ఇది ఉపయోగించబడుతుంది (యోహాను సువార్త 7:13). తర్జుమా చేయువారు “యూదు నాయకులు” లేక “యూద ప్రజలు” లేక “యూదులు (నాయకులు)” మరియు యూదులు (సాధారణంగా) అనే మాటలను ఉపయోగించుకోవచ్చు.”