te_tn_old/rev/17/intro.md

3.8 KiB

ప్రకటన 17 సాధారణ అంశములు

విభజన మరియు క్రమము

దేవుడు బబులోనును ఎలా నాశనం చేస్తాడనే వివరణతో ఈ అధ్యాయం ప్రారంభించి ఉంది.

ఈ అధ్యాయములోని విశేషమైన అంశములు

వేశ్య

విగ్రహారాధన చేయు యూదులను అనేక మార్లు లేఖనాలలో వేశ్య జనాంగమని మరియు కొన్ని మార్లు వేశ్యలని సంభోదించారు. ఇది ఇక్కడ సాదృశ్యముగా వాడలేదు. ఈ ఉదాహరణ అస్పష్టముగా ఉండునట్లు అనువాదకులు అనుమతించాలి. (చూడండి: rc://*/ta/man/translate/writing-apocalypticwriting)

ఏడు కొండలు

ఇది బహుశ రోమా పట్టణమును సూచించ వచ్చు, దానిని ఏడు కొండల పట్టణము అని పిలిచేవారు. అయితే, తర్జుమా చేయునప్పుడు రోమాను గుర్తించినట్లు అనువాదకులు ప్రయత్నించకూడదు.

ఈ అధ్యాయంలోని ప్రాముఖ్యమైన అలంకార పదములు

రూపకఅలంకారం

ఈ అధ్యాయంలో యోహాను అనేక రూపకఅలంకార పదాలను ఉపయోగించారు. కొన్నిటి అర్థములు అతడు తెలియజేసిన మరి కొన్ని వాటిని అస్పష్టముగా విడిచారు. అనువాదకులు కూడా ఆ విధముగానే చేయవలెను. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

ఈ అధ్యాయంలో ఎదురైయ్యె ఇతర తర్జుమా ఇబ్బందులు

“నీవు చూసిన క్రూర మృగము ఇప్పుడు లేదు”

ఈ అధ్యాయంలో ఇది మరియు ఇటువంటి కొన్ని మాటలు క్రూర మృగము మరియు యేసు మధ్యలో ఉన్న వ్యత్యాసమును తెలియజేయుచున్నది. “పూర్వం ఉండి, ప్రస్తుతం ఉంటూ మరియు రానైయున్నవాడు” అని యేసుని ప్రకటన గ్రంథములో తప్ప మరెక్కడా పిలువబడలేదు. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

అసంబంధము

అసాధ్యమైన ఒక విషయమును వివరించే సత్యమైన వాక్యమును అసంబంధము అని పిలుస్తారు. 17:11వ వచనములోని ఈ వాక్యము అసంబంధమైయున్నది: “క్రూర మృగము... ఎనిమిదవ రాజుగా ఉన్నది; అయితే అది ఏడు రాజులలో ఒకటిగా ఉండెను.” అనువాదకులు ఈ అసంబంధమును పరిష్కరించుటకు ప్రయత్నం చేయకూడదు. అది ఒక రహస్యముగా ఉండవలెను. (ప్రకటన.17:11)