te_tn_old/jhn/02/intro.md

2.8 KiB

యోహాను సువార్త 02వ అధ్యాయములోని సాధారణ గమనికలు

ఈ అధ్యాయములోని ప్రత్యేక అంశాలు

ద్రాక్షరసం

యూదులు అనేక భోజనాలలో మరియు ప్రత్యేకముగా విశేష కార్యక్రమాలను జరుపుకునేటపుడు వారు ద్రాక్షరసమును త్రాగేవారు. ద్రాక్షరసం త్రాగడం పాపమని వారు నమ్మలేదు.

డబ్బును మారకం చేసేవారిని బయటకు నేట్టివేయడం

ఆలయము మీద మరియు ఇశ్రాయేలీయులందరి మీద అధికారం ఉందని చూపించడానికి యేసు డబ్బును మారకం చేసేవారిని దేవాలయము నుండి పంపించాడు.

“మనిషిలో ఏముందో ఆయనకు తెలుసు” యేసు మనుష్య కుమారుడు మరియు దేవుని కుమారుడు కాబట్టి ఇతరులు ఏమి ఆలోచిస్తున్నారో ఆయనకు తెలుసు.

ఈ అధ్యాయములో ఇతర తర్జుమా ఇబ్బందులు

“ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకున్నారు”

ముఖ్యమైన చరిత్రను చెప్పడం మానేయడానికి మరియు చాలా ముందు జరిగిన దేని గురించో చెప్పడానికి యోహాను ఈ వాక్యాన్ని ఉపయోగించాడు. ఆయన పావురాల విక్రేతలను యోహాను సువార్త 2:16)లో గద్దించిన తరువాతే యూదా అధికారులు ఆయనతో మాట్లాడారు. యేసు పునరుత్థానుడైన తరువాత, శిష్యులు చాలా కలం క్రితం ప్రవక్త వ్రాసిన వాటిని మరియు యేసు తన దేహమే ఆలయమన్న దాని గురించి చెప్పినదానిని జ్ఞాపకం చేసుకున్నారు (యోహాను సువార్త 2:17 మరియు యోహాను సువార్త 2:22).