te_tn_old/jhn/01/intro.md

5.2 KiB

యోహాను సువార్త 01వ అధ్యాయములోని సాధారణ గమనికలు

నిర్మాణం మరియు క్రమపరచుట

కొన్ని తర్జుమాలు చదవడానికి సులువుగా ఉండటానికి కావ్యంలోని ప్రతి పంక్తిని మిగిలిన వచనం కంటే కుడి వైపుకు అమర్చుతాయి. పాత నిబంధనలోని వాక్యాలైన 1:23 లోని కావ్యాలతో యు.ఎల్.టి(ULT) దీనిని చేస్తుంది.

ఈ అధ్యాయములోని ప్రత్యేక అంశాలు

“వాక్కు”

యోహాను యేసును గురించి తెలియచేయుటకు “వాక్కు” ను ఉపయోగిస్తాడు (యోహాను సువార్త 1:1, 14). నిజానికి యేసు శరీరధారియైన వ్యక్తి అని యోహాను ప్రజలందరికి దేవుని అతి ముఖ్యమైన సందేశాన్ని చెప్పుచున్నాడు. (చూడండి: rc://*/tw/dict/bible/kt/wordofgod)

వెలుగు మరియు చీకటి

పరిశుద్ద గ్రంథము తరచుగా దేవునికి నచ్చినది చేయని వ్యక్తుల గురించి, వారు చీకటిలోనే తిరుగుతున్నట్లు అని అవినీతిమంతులైనవారి గురించి చెప్పుచున్నది. ఆ పాపపు ప్రజలను నీతిమంతులుగా మార్చడానికి, వారు ఏమి తప్పు చేస్తున్నారో అర్థం చేసుకోవడానికి మరియు దేవునికి విధేయత చూపడం ప్రారంభించినట్లుగా ఇది వెలుగు గురించి చెప్పుచున్నది. (చూడండి: rc://*/tw/dict/bible/kt/righteous)

“దేవుని పిల్లలు”

ప్రజలు యేసును విశ్వసించినప్పుడు వారు “కోపపు పిల్లలు” నుండి “దేవుని పిల్లలు” అవుతారు.” వారు దేవుని కుటుంబం” లోకి స్వీకరించబడ్డారు. వారు దేవుని కుటుంబం” లోకి స్వీకరించబడ్డారు. ఇది క్రొత్త నిబంధనలో విశదపరచబడ్డ ఒక ముఖ్యమైన ప్రతిరూపమైయున్నది. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/believe]] మరియు [[rc:///tw/dict/bible/kt/adoption]])

ఈ అధ్యాయములోని ముఖ్యమైన భాషీయములు

రూపకఅలంకారములు

మంచి మరియు చెడు గురించి, దేవుడు యేసుని ద్వారా ప్రజలకు చెప్పాలనుకునేదాని గురించి ఎక్కువగా వ్రాస్తానని చదవరులకు చెప్పడానికి యోహాను వెలుగు మరియు చీకటి మరియు వాక్కు యొక్క రూపకఅలంకారాలను ఉపయోగిస్తాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

ఈ అధ్యాయములో ఇతర తర్జుమా ఇబ్బందులు

“ఆదియందు”

లోకము నిరంతరము ఉన్నట్లుగా, దానికి ఆరంభం లేదని కొన్ని భాషలు మరియు పద్దతులు చెప్పుచున్నాయి. అయితే “చాలా కాలం క్రితం” అనేది “ఆదియందు” అనే దానికన్నా భిన్నంగా ఉంటుంది మరియు మీ అనువాదం సరిగ్గా తెలియపరుస్తుందని మీరు నిర్ధారించుకోవాలి.

”మనుష్య కుమారుడు”

ఈ అధ్యాయములో యేసు తనను తానూ “మనుష్యకుమారుడు” అని తెలియచేస్తున్నాడు (యోహాను సువార్త 1:51). మీ భాష వారు వేరొకరి గురించి మాట్లాడుతున్నట్లుగా తమను తాము మాట్లాడటానికి అనుమతించకపోవచ్చు. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/sonofman]] మరియు [[rc:///ta/man/translate/figs-123person]])