te_tn_old/jas/01/intro.md

4.2 KiB

యాకోబు 01 సాధారణ వివరాలు

నిర్మాణం, నిర్దిష్టరూపం

యాకోబు లాంచనంగా 1వ వచనంలో ఈ పత్రికను పరిచయం చేస్తున్నాడు. తూర్పు దేశాలలో పురాతన కాలంలో ఈ విదంగా రచయితలు తమ పత్రికలను వ్రాయడం ఆరంభించేవారు.

ఈ అధ్యాయంలో ప్రత్యేకమైన అంశాలు,

పరీక్షించడం, శోధన

ఈ రెండు పదాలు (యాకోబు.1:12-13)లో కనిపిస్తాయి.. మంచినీ, చెడునూ చేయడానికి నిర్ణయం తీసుకోగల ఒక వ్యక్తిని గురించి ఈ రెండు పదాలు మాట్లాడుతున్నాయి. వాటి మధ్యనున్న వ్యత్యాసం చాలా ప్రాముఖ్యం. దేవుడు ఒక వ్యక్తిని పరీక్షిస్తాడు, అతడు మేలైనదానిని చెయ్యాలని కోరతాడు. సాతానుడు ఒక వ్యక్తిని శోధిస్తాడు, అతడు దుష్ట కార్యములనే చేయాలని కోరుకుంటాడు. .

కిరీటములు

పరీక్షలో ఉత్తీర్ణుడైన వ్యక్తి పొందుకొను బహుమానమే ఈ కిరీటం, ప్రజలు ఏదైనా మంచి పనులను చేసినప్పుడు ఈ కిరీటాన్ని పొందుకుంటారు. (చూడండి: rc://*/tw/dict/bible/other/reward)

ఈ అధ్యాయములో ప్రాముఖ్యమైన అలంకారిక మాటలు

రూపకలంకారము

యాకోబు ఈ అధ్యాయములో అనేకమైన రూపకలంకారములను ఉపయోగిస్తున్నాడు, మీరు వాటిని చక్కగా తర్జుమా చేయడానికి ముందే రూపకలంకార పేజి మీదనున్న అంశాలను మీరు అర్థం చేసికొనవలసిన అవసరత ఉన్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

ఈ అధ్యాయములో ఇతర తర్జుమాపరమైన ఇబ్బందులు

“చెదరిపోయిన పన్నెండు గోత్రములవారికి”

యాకోబు ఈ పత్రికను ఎవరికి వ్రాస్తున్నాడో అనే విషయము అంత స్పష్టముగా లేదు. ప్రభువైన యేసుక్రీస్తు దాసుడని తనను గూర్చి తాను తెలియజేసుకొంటున్నాడు, అందుచేత అతను బహుశా క్రైస్తవులకే రాస్తుండవచ్చు. అయితే అతడు తన పాఠకులను “చెదరిపోయిన పన్నెండు గోత్రములవారు” అని పిలుస్తున్నాడు. ఈ మాటలు సాధారణంగా యూదులను సూచిస్తున్నాయి. “దేవుడు ఎన్నుకొనిన ప్రజలందరూ” అని చెప్పడానికి బహుశయాకోబు ఈ మాటలను రూపకలంకారంగా ఉపయోగించియుండవచ్చును లేక ఎక్కువ శాతపు క్రైస్తవులు యూదులవలె ఎదిగిన సమయానికి అతడు ఈ పత్రికను వ్రాసియుండవచ్చును.