te_tn/mrk/02/intro.md

2.9 KiB

మర్కు సువార్త 02వ అధ్యాయములోని సాధారణ గమనికలు

ఈ అధ్యాయములోని ప్రత్యేక అంశములు

“పాపులు”

యేసు కాలపు ప్రజలు పాపుల గురించి మాట్లాడినప్పుడు, వారు మోషే ధర్మశాస్త్రానికి విధేయత చూపని దొంగతనం లేక లైంగిక పాపాలవంటి పాపాలకు పాల్పడిన వ్యక్తుల గురించి మాట్లాడుతున్నారు. తాను “పాపులను’’ పిలచుటకు వచ్చానని యేసు చెప్పినప్పుడు తాము పాపులమని నమ్మే వ్యక్తులు మాత్రమే తన శిష్యులు కాగలరని ఆయన అర్థం. చాలా మంది ప్రజలు తాము “పాపులు” అని భావించకపోయినా ఇది నిజం. (చూడండి: rc://*/tw/dict/bible/kt/sin)

ఉపవాసం మరియు విందు

ప్రజలు విచారంగా ఉన్నప్పుడు లేక దేవునికి తమ పాపాల గురించి క్షమాపణ చూపిస్తున్నప్పుడు ప్రజలు ఉపవాసం చేస్తారు లేక ఎక్కువ సేపు ఆహారం తినరు. వారు సంతోషంగా ఉన్నప్పుడు వివాహాల మాదిరిగానే వారు విందులు లేక భోజనం చేస్తారు, అక్కడ వారు ఎక్కువ ఆహారం తింటారు. (చూడండి: rc://*/tw/dict/bible/other/fast)

\nఈ అధ్యాయములోని ముఖ్యమైన భాషీయములు

అలంకారిక ప్రశ్నలు

యేసు చెప్పిన మరియు చేసిన పనుల వలన యూదు నాయకులు కోపంగా ఉన్నారని మరియు అయన దేవుని కుమారుడని వారు నమ్మలేదని చూపించుటకు వారు అలంకారిక ప్రశ్నలను ఉపయోగించారు. (మార్కు 2:7). యూదు నాయకులు ఆహంకారులని చూపించుటకు యేసు వాటిని ఉపయోగించాడు (మార్కు 2:25-26). (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)