te_tn/jhn/20/intro.md

5.1 KiB

యోహాను సువార్త 20వ అధ్యాయంలోని సాధారణ గమనికలు

ఈ అధ్యాయములోని ప్రత్యేక అంశాలు

సమాధి

యేసును పాతిపెట్టబడిన సమాధి (యోహాను సువార్త 20:1) ధనవంతులైన యూదా కుటుంబాలు వారి మరణించిన వారిని పాతిపెట్టే సమాధియైయున్నది. అసలు ఇది ఒక రాతిలో తొలచిన గదియైయున్నది. ఇది ఒక వైపున చదునైన స్థలమును కలిగియుంది, అక్కడ వారు దానిపై నూనె మరియు సుగంధ ద్రవ్యములు పోసి బట్టలో చుట్టిన తరువాత శరీరమును దానిలో ఉంచవచ్చు. అప్పుడు వారు సమాధి ముందు ఒక పెద్ద రాయిని చుట్టేవారు కాబట్టి లోపల ఎవరు చూడలేరు లేక ప్రవేశించలేరు.

“పరిశుద్ధాత్మను పొందుకోండి”

మీ భాష “ఊపిరి” మరియు “ఆత్మ” అనే మాటలను ఉపయోగిస్తుంటే, యేసు ఊపిరి పీల్చడం ద్వారా సాంకేతిక కార్యమును చేస్తున్నాడని చదవరులు అర్థం చేసుకున్నారని నిర్ధారించుకోండి మరియు శిష్యులు యేసు ఊపిరిని కాక పరిశుద్ధాత్మను పొందుకున్నారు. (చూడండి: [[rc:///ta/man/translate/translate-symaction]] మరియు [[rc:///tw/dict/bible/kt/holyspirit]])

ఈ అధ్యాయములో ఇతర తర్జుమా ఇబ్బందులు

రబ్బూని

ఈ మాటల యొక్క శబ్దమును వివరించుటకు గ్రీకు అక్షరాలను ఉపయోగించాడు, ఆ తరువాత దాని అర్థం “బోధకుడు” అని వివరించాడు. మీ భాష యొక్క అక్షరాలను ఉపయోగించి మీరు కూడా అదే చేయాలి.

యేసు పునరుత్థాన దేహం

యేసు బ్రతికిన తరువాత ఆయన దేహం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఆయన శిష్యులకు ఆయన యేసు అని తెలుసు ఎందుకంటే వారు ఆయన ముఖమును చూడగలరు మరియు సైనికులు తన చేతులు మరియు కాళ్ళకు మేకులను కొట్టిన భాగములను తాకగలరు, కానీ ఆయన గట్టి గోడలు మరియు ద్వారముల ద్వారా నడవగలడు. యు.ఎల్.టి(ULT) చెప్పినదానికంటే ఎక్కువ చెప్పుటకు ప్రయత్నించక పోవడమే మంచిది.

తెల్ల బట్టలు వేసుకున్న ఇద్దరు దేవదూతలు

మత్తయి, మార్కు, లూకా మరియు యోహాను అందరూ యేసు సమాధి దగ్గర ఉన్న స్త్రీలతో తెల్లని బట్టలు వేసుకున్న దేవదూతల గురించి వ్రాసారు. ఇద్దరు రచయితలు దేవదూతలు మానవ రూపములో ఉన్నందున వారిని మనుష్యులని పిలిచారు. ఇద్దరు రచయితలు ఇద్దరు దేవదూతల గురించి వ్రాసారు, కాని మిగతా ఇద్దరు రచయితలు వారిలో ఒకరి గురించి మాత్రమే వ్రాసారు. ఈ వాక్యభాగామంతటిని ఒకేలా చెప్పే ప్రయత్నం చేయకుండా, వాక్య భాగాలలో ప్రతి ఒక్కటి యు.ఎల్.టి(ULT)లో కనిపించే విధంగా తర్జుమా చెయడం మంచిది. (చూడండి: మత్తయి సువార్త 28:1-2 మరియు మార్కు సువార్త 16:15 మరియు లూకా సువార్త 24:4 మరియు (యోహాను సువార్త 20:12)