te_tw/bible/other/overseer.md

3.9 KiB

పై విచారణ చేయడం, పైవిచారణ కర్త, సంరక్షకుడు

నిర్వచనం:

“పై విచారణకర్త” పదం ఒక పని మీద, ఇతర ప్రజల క్షేమం గురించిన బాధ్యత తీసుకొన్న వ్యక్తిని సూచిస్తుంది. బైబిలులో "సంరక్షకుడు" అంటే "పై విచారణ కర్త" అని అర్థం.

  • పాతనిబంధనలో, పై విచారణ కర్తకు తన పర్యవేక్షణలో ఉన్న పనివారు సరిగా పని జరిగించేలా చెయ్యవలసిన బాధ్యత ఉంది.
  • కొత్తనిబంధనలో ఈ పదం ఆదిమ క్రైస్తవ సంఘం నాయకులను సూచిస్తుంచడానికి ఉపయోగించబడింది. సంఘం ఆత్మీయ అవసరాలు తీర్చడం, విశ్వాసులు ఖచ్చితమైన వాక్య బోధను పొందుతున్నారని చూడడం వారి పని.
  • ఒక పై విచారణ కర్త తన “మంద”గా ఉన్న స్థానిక సంఘ విశ్వాసుల విషయంలో శ్రద్ధ తీసుకొనే కాపరిలాంటి వాడు అని పౌలు సూచిస్తున్నాడు.
  • పైవిచారణ కర్త ఒక కాపరిలా మందను జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉంటాడు. అతడు తప్పుడు ఆత్మీయ బోధ నుండీ, ఇతర దుష్ట ప్రభావాలనుండీ విశ్వాసులను కాపాడుతాడు, భద్రపరుస్తాడు.
  • కొత్త నిబంధనలో, “పై విచారణకర్తలు,” “పెద్దలు,” “కాయువారు/కాపరులు” అనే పదాలు ఒకే విధమైన ఆత్మీయ నాయకులను సూచించే వివిధ రూపాలు.

అనువాదం సూచనలు

  • ఈ పదం “పర్యవేక్షకుడు” లేదా “సంరక్షకుడు” లేదా “నిర్వాహకుడు" అని వివిధ రూపాలలో అనువదించబడవచ్చు.
  • దేవుని ప్రజల స్థానిక గుంపుకు నాయకుడిని సూచించేటప్పుడు, ఈ పదం “ఆత్మీయ పర్యవేక్షకుడు” లేదా “విశ్వాసుల గుంపు ఆత్మీయ అవసరాలవిషయంలో శ్రద్ధ తీసుకొనేవాడు” లేదా “సంఘ ఆత్మీయ అవసరాలను పర్యవేక్షించువాడు” అని అనువదించబడవచ్చు.

(చూడండి: సంఘం, పెద్ద, కాపరి, పైవిచారణకర్త)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H5329, H6485, H6496, H7860, H8104, G1983, G1984, G1985