te_tw/bible/kt/zealous.md

3.2 KiB

ఆసక్తి, ఆసక్తికరమైన

నిర్వచనం:

“ఆసక్తి” మరియు “ఆసక్తితో” అనే పదాలు ఒక వ్యక్తికిగాని లేక ఒక ఆలోచనకుగాని చాలా బలమైన అంకితభావము కలిగియుండుటను సూచించును.

  • ఆసక్తి పదంలో మంచికి కారణమయ్యే బలమైన ఆశ మరియు క్రియలు ఉంటాయి. ఒక వ్యక్తి నమ్మకంగా దేవునికి విధేయత చూపుతూ, దానిని ఇతరులు కూడా చేయాలని బోధించే వ్యక్తిని వివరించడానికి ఉపయోగించబడియున్నది.
  • ఆసక్తి కలిగియుండడంలో ఏదైనా ఒక విషయమును చేయుటకు తీవ్రమైన కృషిని ఉంచడం, ఆ ప్రయాసలో నిరంతరం కొనసాగుచూ కొనసాగడం ఉంటుంది.
  • “ప్రభువు ఆసక్తి” లేక “యెహోవా ఆసక్తి” పదాలు తన ప్రజలను ఆశీర్వదించడంలో దేవుని దేవుని బలమైన నిరంతర క్రియలనూ, న్యాయం జరిగేలా చూడడాన్ని సూచిస్తుంది.

అనువాదం సూచనలు:

  • “ఆసక్తి కలిగియుండుట” అనే ఈ మాటను “బలమైన శ్రద్ధాసక్తిగల” లేక “తీవ్రమైన కృషి చేయుట” అని కూడా తర్జుమా చేయవచ్చును.
  • “ఆసక్తి” అనే పదము “శక్తితో కూడిన భక్తి” లేక “ఆసక్తితో కూడిన నిర్ధారణ” లేక “నీతిగల అత్యుత్సాహము” అని కూడా తర్జుమా చేయుదురు.
  • “నీ ఇంటికొరకైన ఆసక్తి” అనే పదబంధం “నీ దేవాలయాన్ని బలంగా ఘనపరచడం" లేదా “నీ గృహాన్ని చూచుకోవడంలో తీవ్రమైన కోరికను కలిగియుండుట” అని అనువదించబడవచ్చు.

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H7065, H7068, G2205, G2206, G2207, G6041