te_tw/bible/kt/worthy.md

4.6 KiB

యోగ్యమైన, యోగ్యత, అయోగ్య, యోగ్యరహిత

నిర్వచనం:

“యోగ్యమైన” అనే పదము గౌరవము లేక ఘనత పొందగలిగిన ఒకదానిని లేదా ఒక వ్యక్తిని వివరిస్తుంది. “యోగ్యత కలిగియుండడం” అంటే విలువైనదిగాను లేదా ప్రాముఖ్యమైనదిగాను ఉండడం అని అర్థం. “అయోగ్య” అనే పదానికి ఎటువంటి విలువలేనిది అని అర్థం.

  • యోగ్యత కలిగియుండడం అంటే అనగా విలువైనదిగా ఉండడం లేదా ప్రాముఖ్యమైనదిగా ఉండడం అని అర్థం.
  • “అయోగ్యముగానుండడం” అంటే ఎటువంటి విశేషమైన గమనానికి అర్హతలేకుండా ఉండడం అని అర్థం.
  • యోగ్యమైన అని భావించకుండా ఉండడం అంటే ఇతరులకంటే తక్కువ ప్రాముఖ్యమని యెంచడం లేదా దయనూ లేదా ఘనతనూ పొందే అర్హత కలదని భావించకుండ ఉండడం అని అర్థం.
  • “అయోగ్య,” “యోగ్యరహిత” పదాలు ఒకదానికొకటి సంబంధము కలిగియుంటాయి, అయితే విభిన్నమైన అర్థాలను కలిగియుంటాయి. “యోగ్యతలేని" విధంగా ఉండడం అంటే ఎటువంటి గుర్తింపుకైనా లేదా ఘనతకైనా అర్హతలేదని అర్థం. "యోగ్యరహితం” గా ఉండడం అంటే ఎటువంటి ఉద్దేశము లేదా విలువ లేకుండ ఉండడం అని అర్థం.

అనువాదం సూచనలు:

  • “యోగ్యమైన” అనే పదం “అర్హత” లేదా “ప్రాముఖ్యత” లేదా “విలువైన” అని అనువదించబడవచ్చు.
  • “యోగ్యత” అనే పదం “విలువ” లేదా “ప్రాముఖ్యత” అని అనువదించబడవచ్చు.
  • “యోగ్యత కలిగియుండు” అనే వాక్యమును “విలువను కలిగియుండడం” లేదా “ప్రాముఖ్యత కలిగియుండడం” అని అనువదించబడవచ్చు.
  • “దానికంటే యోగ్యత కలిగినది” అనే పదబంధం “దానికంటే విలువైనది” అని అనువదించబడవచ్చు.
  • సందర్భాన్ని బట్టి “యోగ్యతలేని” అనే పదం “అప్రాముఖ్యత” లేక “అగౌరవము” లేక “అనర్హత” అని కూడా అనువదించబడవచ్చు.
  • “యోగ్యరహిత” అనే పదం “విలువలేనిది” లేదా “ఉద్దేశములేనిది” లేదా “యోగ్యతలేనిది” అని అనువదించబడవచ్చు.

(చూడండి: ఘనత)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H117, H639, H1929, H3644, H4242, H4373, H4392, H4592, H4941, H6994, H7939, G514, G515, G516, G2425, G2661, G2735