te_tw/bible/kt/life.md

7.8 KiB

జీవం, జీవించు, జీవముతో ఉన్న, సజీవ

నిర్వచనం:

"జీవం" పదం భౌతికంగా చనిపోయి ఉండడానికి వ్యతిరేకంగా భౌతికంగా సజీవంగా ఉండడాన్ని సూచిస్తుంది.

1 శారీరక (భౌతిక) జీవం

  • ఒక "జీవం" పదం "ఒక జీవితం కాపాడబడింది" లో ఉన్నట్టుగా ఒక వ్యక్తిగత జీవితాన్ని కూడా సూచిస్తుంది.
  • కొన్నిసార్లు “జీవం” పదం “అతని జీవితం ఆనందభరితంగా ఉంది” లో ఉన్నట్టుగా జీవిస్తున్న అనుభవాన్ని సూచిస్తుంది.
  • “అతని జీవిత అంతం” అనే వాక్యంలో ఉన్నట్టుగా ఇది ఒక వ్యక్తి జీవిత కాలపరిమితిని కూడా సూచిస్తుంది.
  • ”జీవించడం” పదం “మా అమ్మ ఇంకా జీవించే ఉంది” లో ఉన్నట్టుగా శారీరికంగా సజీవంగా ఉండడాన్ని సూచిస్తుంది. “వారు పట్టణంలో నివసిస్తున్నారు”లో ఉన్నట్టుగా ఒక చోట నివసిస్తున్నారు అని సూచిస్తుంది.
  • బైబిలులో “జీవం” అనే అంశం “మరణం” అంశాన్ని తరుచుగా విభేదిస్తుంది.

2 శాశ్వత జీవం

  • ఒక వ్యక్తి యేసు నందు విశ్వాసముంచినప్పుడు శాశ్వత జీవాన్ని కలిగియుంటాడు, దేవుడు ఆ వ్యక్తిలో పరిశుద్ధాత్మ జీవించడం ద్వారా పరివర్తన చెందిన జీవితాన్ని ఇస్తాడు.
  • శాశ్వత జీవానికి వ్యతిరేక పదం శాశ్వత మరణం, అంటే దేవుని నుండి వేరైపోవడం, శాశ్వత శిక్షను అనుభవించడం.

అనువాదం సూచనలు:

  • సందర్భాన్ని బట్టి, “జీవం” పదం “ఉనికి” లేదా “వ్యక్తి” లేదా “ప్రాణం" లేదా జీవి" లేదా "అనుభవం" అని అనువదించబడవచ్చు.
  • ”జీవించడం” పదం “నివసించడం” లేదా లేక “ఉండడం” లేక “ఉనికిలో ఉండడం” అని అనువదించబడవచ్చు.
  • “జీవిత అంతం” అనే వాక్యం "అతడు జీవించడం నిలిపివేసినపుడు” అని అనువదించబడవచ్చు.
  • ”వారి జీవితాలు ఉండనిచ్చారు" అనే వాక్యం “వారు జీవించడానికి అనుమతించారు” లేదా "వారిని చంపలేదు" అని అనువదించబడవచ్చు.
  • ”వారు తమ ప్రాణాల్ని పణంగా పెట్టారు” అనే వాక్యం “వారు తమని తాము ప్రమాదంలో ఉంచుకొన్నారు” లేదా “తమను చంపివెయ్యగల ఒక కార్యాన్ని చేసారు” అని అనువదించబడవచ్చు.
  • శాశ్వత జీవం గురించి బైబిలు చెపుతున్నప్పుడు, “జీవం” పదం “శాశ్వత జీవం” లేదా "దేవుడు మన ఆత్మలలో మనలను సజీవంగా చేస్తున్నాడు" లేదా "దేవుని ఆత్మ చేత నూతన జీవితం" లేదా "మన అంతరంగంలో సజీవం చెయ్యబడడం" అని అనువదించబడవచ్చు.
  • సందర్భాన్ని బట్టి, “జీవాన్ని ఇవ్వడం” అనే వాక్యం “జీవించేలా చెయ్యడం" లేదా "శాశ్వత జీవం ఇవ్వడం" లేదా "శాశ్వతంగా జీవించేలా చెయ్యడం" అని అనువదించబడవచ్చు.

(చూడండి: మరణం, శాశ్వతమైన)

బైబిలు రెఫరెన్సులు:

బైబిలు కథలనుండి ఉదాహరణలు:

  • 01:10 కనుక దేవుడు నేల మట్టిని తీసుకొని మానవుణ్ణి చేసాడు, అతనిలో జీవాన్ని ఊదాడు.
  • 03:01 చాలా కాలం తరువాత లోకంలో అనేకమంది ప్రజలు జీవిస్తూ వచ్చారు.
  • 08:01 యోసేపు సోదరులు తమ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, యోసేపు ఇంకా సజీవం గా ఉన్నాడని తమ తండ్రితో చెప్పారు. అతడు మిక్కిలి సంతోషించాడు.
  • 17:0 9 అయితే అతని (దావీదు)జీవితం అంతంలో దేవుని యెదుట భయంకర పాపం చేసాడు.
  • 27:01 ఒక రోజు యూదా ధర్మశాస్త్ర ప్రవీణుడు ఆయనను శోధించాలని యేసునొద్దకు వచ్చాడు., “బోధకుడూ నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చెయ్యాలి?” అని ఆయనను అడిగాడు.
  • 35:05”పునరుద్దానమునూ, జీవమునూ నేనే” అని యేసు జవాబిచ్చాడు.
  • 44:05 “యేసును చంపమని రోమా అధిపతికి మీరే చెప్పారు. జీవాధి పతిని మీరే చంపారు, అయితే దేవుడు ఆయనను మృతులలోనుండి లేపాడు.

పదం సమాచారం:

  • Strong's: H1934, H2416, H2417, H2421, H2425, H5315, G198, G222, G227, G806, G590