te_tw/bible/kt/holy.md

9.5 KiB

పరిశుద్ధమైన, పరిశుద్ధత, అపరిశుద్ధమైన, పవిత్రమైన

నిర్వచనం:

"పరిశుద్ధమైన,” “పరిశుద్ధత " పదాలు పూర్తిగా ప్రత్యేకించబడిన, పాపయుక్తమైన, లోపపూరితమైన సమస్తం నుండి వేరుగా ఉన్న దేవుని స్వభావాన్ని సూచిస్తున్నాయి. .

  • దేవుడు ఒక్కడే సంపూర్ణంగా పరిశుద్ధుడు. అయన మనుషులను, వస్తువులను పరిశుద్ధ పరుస్తాడు.
  • పరిశుద్ధుడైన ఒక వ్యక్తి దేవునికి చెందిన వాడు. దేవుణ్ణి సేవించడానికీ, ఆయనను మహిమ పరిచే ఉద్దేశంతో ప్రత్యేకించబడిన వాడు.
  • దేవుడు పరిశుద్ధమైనది అని ప్రకటించిన వస్తువు తన మహిమ, తన వాడకం కోసం ప్రత్యేకించబడినది. బలిపీఠం లాంటివి ఆయనకు బలి అర్పణలు సమర్పించబడడం కోసం ఉపయోగించబడతాయి.
  • అయన అనుమతిస్తే తప్పించి మనుషులు ఆయనను సమీపించలేరు. ఎందుకంటే అయన పరిశుద్ధుడు వారు కేవలం పాపపూరితమైన, అపరిపూర్ణమైన మానవులు.
  • పాత నిబంధనలో, దేవుడు యాజకులను తనకు ప్రత్యేక సేవ చేయడం కోసం పరిశుద్ధపరిచాడు. వారు ఆచారరీతిగా పాపం నుండి శుద్దులై దేవుణ్ణి సమిపించగలుగుతారు.
  • దేవుడు తనకు చెందిన కొన్ని స్థలాలనూ, వస్తువులనూ పరిశుద్ధమైనవిగా ప్రత్యేకించాడు. లేదా తన ఆలయం లాంటి వాటి మూలంగా తనను వెల్లడి చేసుకుంటాడు.

అక్షరాలా, "అపరిశుద్ధమైన" అంటే "పరిశుద్ధము కానివి" అని అర్థం. దేవుణ్ణి ఘనపరచని వస్తువునూ లేదా వ్యక్తినీ వివరిస్తుంది.

  • దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చెయ్యడం ద్వారా దేవుని అగౌరవపరుస్తూ ఉన్న వ్యక్తిని వివరించడానికి ఈ పదం ఉపయోగించబడుతుంది.
  • "అపరిశుద్ధమైన" అని పిలువబడినదానిని సాధారణంగా ఉంది, చెడిపోయి ఉంది లేదా అపవిత్రంగా ఉంది అని వివరించబడవచ్చు. ఇది దేవునికి చెందినది కాదు.

"పవిత్రమైన" పదం దేవుణ్ణి ఆరాధించడానిని లేదా అబద్దపు దేవుళ్ళ అన్యమత ఆరాధనకు సంబంధించినదిగా ఉంది.

  • పాత నిబంధనలో, "పవిత్రమైన" పదం అబద్ద దేవుళ్ళ ఆరాధనలో ఉపయోగించే రాతి స్తంభాలు, ఇతర వస్తువులను వివరించడానికి ఉపయోగించబడుతుంది. ఈ పదం "మత సంబంధమైన" అని కూడా అనువదించబడవచ్చు.
  • "పవిత్రమైన పాటలు,” “పవిత్ర సంగీతం" అంటే దేవుని మహిమకోసం పాడేవీ లేదా వాయించబడేవి అని సూచించబడుతున్నాయి. "యెహోవాను ఆరాధించడం కోసం సంగీతం" లేదా "దేవుణ్ణి స్తుతించే పాటలు" అని అనువదించబడవచ్చు.
  • "పవిత్ర విధులు" పదం ప్రజలు దేవుణ్ణి ఆరాధించడంలో నడిపించడానికి యాజకుడు జరిగించే "మతపర విధులు” లేదా “ఆచార పరమైన" కార్తంయాలను సూచిస్తుంది. ఇది అబద్ధ దేవుళ్ళ విగ్రహ పూజల్లో ఆ యాజకులు చేసే ఆచారపరమైన కార్యాలనూ సూచిస్తున్నాయి.

అనువాదం సూచనలు:

  • "పరిశుద్ధమైన" పదం "దేవునికోసం ప్రత్యేకించిన” లేదా “దేవునికి చెందిన” లేదా “పూర్తిగా పవిత్రమైన" లేదా "పరిపూర్ణ పాప రహిత” లేదా "పాపం నుండి వేరుచెయ్యబడిన" అని ఇతరవిధాలుగా అనువదించబడవచ్చు.

  • "పరిశుద్ధపరచు" పదం తరచుగా ఇంగ్లీషులో "పరిశుద్ధ పరచు" అని అనివదించబడుతుంది. "దేవుని కోసం (ఒకరిని) ప్రత్యేక పరచు" అని కూడా అనువదించబడవచ్చు.

  • "అపరిశుద్ధమైన" పదం "పరిశుద్ధం కాని" లేదా "దేవునికి చెందని” లేదా “దేవుణ్ణి ఘనపరచని" అని ఇతర విధానాలలో అనువదించబడవచ్చు.

  • కొన్ని సందర్భాల్లో, "అపరిశుద్ధమైన" పదం "అపవిత్రం" అని అనువదించబడవచ్చు.

(చూడండి: పరిశుద్ధాత్మ, సమర్పించు, పరిశుద్ధపరచు, ప్రత్యేకించు)

బైబిలు రిఫరెన్సులు:

బైబిలు కథల నుండి ఉదాహరణలు:

  • 01:16 అయన (దేవుడు) ఏడవ రోజును దీవించి పరిశుద్ధపరిచాడు. ఎందుకంటే ఆరోజు అయన తన పనిని మాని విశ్రమించాడు.
  • 09:12 "నీవు పరిశుద్ధమైన నేలపై నిలుచున్నావు."
  • 13:01 "మీరు నా నిబంధనకు లోబడి దానిని పాటించినట్లయితే మీరు నా స్వకీయ సంపాద్యం అవుతారు, ఒక యాజకలైన రాజ్యంగానూ, పరిశుద్ధ జనముగానూ ఉంటారు."
  • 13:05 విశ్రాంతి దినమును పరిశుద్ధ మైనదిగా ఆచరించడానికి జాగ్రత్త పడండి."
  • 22:05 "ఆ శిశువు పరిశుద్ధమైన దేవుని కుమారుడు."
  • 50:02 మనం యేసు రాక కోసం ఎదురు చూస్తుండగా పరిశుద్ధంగా ఆయనకు ఘనత కలిగించే విధంగా జీవించాలని అయన కోరుతున్నాడు.

పదం సమాచారం:

  • Strong's: H430, H2455, H2623, H4676, H4720, H6918, H6922, H6942, H6944, H6948, G37, G38, G39, G40, G41, G42, G462, G1859, G2150, G2412, G2413, G2839, G3741, G3742