te_tw/bible/kt/godthefather.md

6.3 KiB

తండ్రియైన దేవుడు, పరలోకపు తండ్రి, తండ్రి

వాస్తవాలు:

"తండ్రి యైన దేవుడు,” “పరలోకపు తండ్రి" పదాలు ఏకైక నిజ దేవుడు యెహోవాను సూచిస్తున్నాయి. "తండ్రి" అనే మరొక పదం యేసు ఆయనను సూచిస్తున్నప్పుడు ఇదే అర్థంతో తరచుగా ఉపయోగించబడింది.

  • దేవుడు తండ్రి యైన దేవుడుగా, కుమారుడు అయిన దేవుడుగా, పరిశుద్ధాత్మ దేవునిగా ఉనికి కలిగి ఉన్నాడు. ప్రతిఒక్కరూ సంపూర్ణంగా దేవుడై ఉన్నారు. అయినా వారు ఒకే ఒక్క దేవుడుగా ఉన్నారు. ఇది ఒక మర్మం, కేవలం మానవులు దీనిని సంపూర్ణంగా అర్థం చేసులోలేరు.
  • తండ్రి అయిన దేవుడు కుమారుడు అయిన దేవుణ్ణి (యేసు) ఈ లోకంలోనికి పంపాడు. ఆయన పరిశుద్ధాత్మను తన ప్రజల వద్దకు పంపుతున్నాడు.
  • కుమారుడైన దేవుని యందు విశ్వాసముంచు వారెవరైనా వారు తండ్రియైన దేవుని బిడ్డ అవుతారు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తిలో నివసిస్తాడు. మానవ మాత్రులు అర్థం చేసుకోలేని మరొక మర్మం ఇది.

అనువాదం సూచనలు:

  • "తండ్రి యైన దేవుడు" పదబంధం అనువదించడంలో మానవ తండ్రిని సూచించడానికి భాషలో సహజంగా ఉపయోగించే "తండ్రి" పదంతోనే అనువదించడం ఉత్తమం.
  • "పరలోక తండ్రి" పదం "పరలోకంలో నివసిస్తున్న తండ్రి” లేదా “పరలోకంలో నివసించే తండ్రి యైన దేవుడు” లేదా “పరలోకం నుండి మన తండ్రి దేవుడు" అని అనువదించబడవచ్చు.
  • సాధారణంగా "తండ్రి" పదం దేవుణ్ణి సూచిస్తూ ఉన్నప్పుడు అక్షరాలు పెద్దవిగా ఉంటాయి.

(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం ఎలా)

(చూడండి: పూర్వీకుడు, దేవుడు, పరలోకం, పరిశుద్ధాత్మ, యేసు, దేవుని కుమారుడు)

బైబిలు రిఫరెన్సులు:

బైబిలు కథల నుండి ఉదాహరణలు:

  • 24:09 ఒకే ఒక దేవుడున్నాడు. అయితే ఆయన యేసుకు బాప్తిస్మం ఇచ్చినప్పుడు తండ్రి యైన దేవుడు మాట్లాడుతుండగా యోహాను విన్నాడు. కుమారుడైన యేసునూ, పరిశుద్ధాత్మను చూచాడు.
  • 29:09 మీలో ప్రతి ఒక్కరూ మీ సోదరుడిని హృదయపూర్వకంగా క్షమించకపోతే “నా పరలోక తండ్రి మీకు కూడా అలానే చేస్తాడు."
  • 37:09 తరువాత యేసు ఆకాశం వైపు చూసి ఇలా చెప్పాడు, "తండ్రీ, నీవు నామాట వింటున్నందుకు వందనాలు."
  • 40:07 తరువాత యేసు గట్టిగా కేక వేసి, "సమాప్తం అయింది! తండ్రీ, నా ఆత్మను నీ చేతులకు అప్పగించుచున్నాను."
  • 42:10 "కాబట్టి వెళ్లి సమస్త ప్రజలకు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ నామమున బాప్తిసం ఇచ్చి శిష్యులుగా చెయ్యండి. నేను అజ్ఞాపించిన వాటన్నిటిని వారు గైకొనేలా బోధించండి."
  • 43:08 "యేసు ఇప్పుడు తండ్రి యైన దేవుని కుడి వైపున హెచ్ఘచించబడ్డాడు.
  • 50:10 "తరువాత నీతిమంతులు వారి తండ్రి దేవుని రాజ్యంలో ప్రకాశిస్తూ ఉంటారు."

పదం సమాచారం:

  • Strong's: H1, H2, G3962