te_tw/bible/kt/discipline.md

2.9 KiB

క్రమశిక్షణ, స్వీయ క్రమశిక్షణ

నిర్వచనం:

"క్రమశిక్షణ" పదం నైతిక ప్రవర్తన కోసం మార్గదర్శకాల సముదాయానికి లోబడియుండడానికి మనుషులకు శిక్షణ ఇవ్వడాన్ని సూచిస్తుంది.

  • తల్లిదండ్రులు వారి పిల్లలకు నైతికమైన నడిపింపు, నిర్దేశం అందివ్వడం ద్వారానూ, లోబడాలని బోధించడం ద్వారానూ వారిని క్రమశిక్షణలో ఉంచుతారు.
  • అదే విధంగా, దేవుడు తన పిల్లలు తమ జీవితంలో సంతోషం, ప్రేమ, సహనం వంటి ఆరోగ్యకరమైన ఆత్మీయ ఫలం పండించేలా వారికి సహాయం చేస్తాడు.
  • క్రమశిక్షణలో దేవుణ్ణి సంతోషపరచడానికి ఏవిధంగా జీవించాలి అనే దాని గురించిన ఉపదేశమూ, దేవుని చిత్తానికి వ్యతిరేకమైన ప్రవర్తనకు వచ్చే శిక్షా ఉంటుంది.
  • స్వీయ-క్రమశిక్షణ అంటే ఒక మనిషి తన సొంత జీవితంలో నైతిక, ఆత్మీయ సూత్రాలను అన్వయించుకొనే ప్రక్రియ.

అనువాదం సూచనలు:

  • సందర్భాన్ని బట్టి, "క్రమశిక్షణ" అనే పదం "శిక్షణ, ఉపదేశం ఇవ్వడం” లేక “నైతిక మార్గ నిర్దేశకత్వం” లేక “చెడువిషయంలో శిక్షించడం" పదాలతో అనువదించబడవచ్చు.
  • "క్రమశిక్షణ" నామవాచకం "నైతిక శిక్షణ” లేదా “శిక్ష” లేదా “నైతిక దిద్దుబాటు” లేదా “నైతిక నడిపింపు, ఉపదేశం" అని అనువదించబడవచ్చు.

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H4148, G1468