te_tw/bible/kt/circumcise.md

8.6 KiB

సున్నతి చేయడం, సున్నతి చేయబడిన, సున్నతి, సున్నతి పొందని, సున్నతి లేని

నిర్వచనం:

"సున్నతి చేయడం" అనే పదం అంటే ఒక పురుషుని లేదా ఒక మగబిడ్డ మర్మాంగం కొనను కోసి వేయడం. సున్నతి ఆచార కర్మను ఈ సందర్భంలో నిర్వహించవచ్చు.

  • అబ్రాహాముకు తన కుటుంబంలోనూ, సేవకులలోనూ ఉన్న ప్రతి మగవానికి వారితో దేవుని నిబంధనకు గుర్తుగా సున్నతి చేయాలని దేవుడు అజ్ఞాపించాడు.
  • అబ్రాహాము సంతానం వారి కుటుంబాలలో ప్రతి తరంలో పుట్టిన ప్రతి మగబిడ్డకు సున్నతి జరిగించడం కొనసాగించాలని దేవుడు అజ్ఞాపించాడు.
  • "హృదయ సున్నతి” అనే వాక్యం "కత్తిరించి వేయడం" లేక “ఒక వ్యక్తిలోనుండి పాపాన్ని తొలగించడం” అనే చిత్ర రూపక అర్థాన్ని సూచిస్తుంది.
  • ఆత్మ సంబంధమైన భావంలో, "సున్నతి చేయబడిన వారు" అంటే వారు దేవుని ప్రజలు అనీ, యేసు రక్తం ద్వారా దేవుడు వారి పాపం నుండి వారిని శుద్దులనుగా చేసాడనీ సూచిస్తుంది.
  • "సున్నతి లేనివారు" అంటే శారీరకంగా సున్నతి జరగని వారు అని సూచిస్తుంది. ఆత్మ సంబంధమైన సున్నతి లేని వారినీ, దేవునితో సంబంధం లేని వారినీ అలంకారికంగా సూచిస్తుంది.

"సున్నతి పొందనివారు" మరియు "సున్నతిలేకపోవడం" పదాలు శారీరకంగా సున్నతి పొందని పురుషులను సూచిస్తుంది. ఈ పదాలు అలంకారికంగా కూడా ఉపయోగించబడతాయి.

  • ఐగుప్తు దేశానికి కూడా సున్నతి అవసరం అయ్యింది. కాబట్టి సున్నతి లేని వారి చేతిలో ఐగుప్తు ఓడిపోయిన సంగతిని గురించి దేవుడు చెపుతున్నప్పుడు "సున్నతి లేనివారు" అని ఐగుప్తువారు తిరస్కరించిన ప్రజలను గురించి చెపుతున్నాడు.

  • "సున్నతి పొందని హృదయం" లేదా "హృదయంలో సున్నతి లేని వారి" గురించి బైబిలు సూచిస్తుంది. ఇది ఈ ప్రజలు దేవుని ప్రజలు కారనీ, వారు మూర్ఖముగా అవిదేయులై ఉన్నారని అలంకారికంగా చెపుతుంది.

  • భాషలో సున్నతి కోసం ఒక పదం ఉపయోగించబడినట్లయితే లేదా తెలిసినట్లయితే "సున్నతి లేని" పదాన్ని "సున్నతి పొందనివారు" అని అనువదించవచ్చు.

  • "సున్నతి లేని" అనే వ్యక్తీకరణ సందర్భాన్ని బట్టి "సున్నతి పొందని ప్రజలు" లేదా "దేవునికి చెందని ప్రజలు" అని అనువదించబడవచ్చు.

  • "దేవుని ప్రజలు కారు" లేదా “దేవునికి చెందని వారివలె తిరుగుబాటు చేసినవారు” లేదా "దేవునికి చెందిన వారు అని ఎటువంటి సూచనా లేనివారు" అని ఇతర భాషారూపాలలో దీనిని అనువదించవచ్చు.

  • "హృదయంలో సున్నతి లేని" అనే వ్యక్తీకరణ "మూర్ఖముగా తరుగుబాటు" లేదా "విశ్వసించడానికి నిరాకరించు" అని అనువదించబడవచ్చు. అయితే ఆత్మ సంబంధమైన సున్నతి భావన ప్రాముఖ్యం కనుక వీలునుబట్టి వ్యక్తీకరణను లేదా ఇలాంటి పదాన్నే ఉంచడం మంచిది.

అనువాదం సూచనలు:

  • లక్ష్య భాష సంస్కృతిలో మగవాళ్ళకు సున్నతి చెయ్యడం ఉన్నట్లయితే దీనిని సూచించడానికి ఉపయోగించే పదాన్ని ఈ పదం కోసం ఉపయోగించాలి.
  • "చుట్టూ కత్తిరించు” లేదా “వృత్తంలో కత్తిరించు” లేదా “మర్మాంగం కొనభాగాన్ని కత్తిరించు" అని ఇతర విధాలుగా అనువదించవచ్చు.
  • సున్నతి గురించి తెలియని సంస్కృతుల్లో దీన్ని ఫుట్ నోట్ లేదా పదకోశంలో వివరించడం అవసరం కావచ్చు.
  • ఈ పదం స్త్రీలను సూచించకుండా ఉండేలా చూడండి. మగ వారికే అని అర్థం ఇచ్చే పదం లేదా వాక్యంతో అనువదించడం అవసరం కావచ్చు.

(చూడండి: తెలియని వాటిని అనువదించడం ఎలా)

(చూడండి: అబ్రాహాము, నిబంధన)

బైబిలు రిఫరెన్సులు:

బైబిలు కథల నుండి ఉదాహరణలు:

  • 05:03 "నీవు నీ కుటుంబంలో ప్రతి మగవాడికి సున్నతి చేయాలి."
  • 05:05 ఆ రోజున అబ్రాహాము తన ఇంటిలో ప్రతి మగవాడికి సున్నతి చేయించాడు.

పదం సమాచారం:

  • Strong's: H4135, H4139, H5243, H6188, H6189, H6190, G203, G564, G1986, G4059, G4061