te_tn/luk/22/19.md

3.2 KiB

రొట్టె

ఈ రొట్టెలో పులవచేసే పదార్ధం లేదు, అందుకే అది చదును గా ఉంటుంది.

దానిని విరిచి

"దానిని విరిచి." లేదా "దానిని ముక్కలు చేసి." ఆయన దానిని చాలా ముక్కలు చేసి ఉంటాడు లేకపోతే రెండు భాగాలు చేసి అపోస్తలులకు తమలో పంచుకోమని ఇచ్చి ఉంటాడు. వీలైతే, రెంటికీ అనువుగా ఉండే మాట వాడు.

ఇది నా శరీరం

అనువైన అర్ధాలు : 1 ) "ఈ రొట్టె నా శరీరం." 2 ) "ఈ రొట్టె నా శరీరాన్ని సూచిస్తున్నది."

మీ కోసం ధారాదత్తమైన నా శరీరం

" మీ కోసం నా శరీరాన్నిఇస్తాను" లేదా " మీ కోసం నా శరీరాన్నిబలిగా అర్పిస్తాను." కొన్ని భాషల్లో, "మీ కోసం నా శరీరాన్నిచంపడానికి అధికారులకు అప్పగిస్తాను," అని తర్జుమా చేయొచ్చు.

ఇది చేయండి

"ఈ రొట్టె తినండి"

నా జ్ఞాపకం గా

"నన్ను జ్ఞాపకం చేసుకోడానికి"

ఈ పాత్ర

"పాత్ర" అంటే దాని లోని ద్రాక్షారసం. దీనిని "ఈ పాత్ర లోని ద్రాక్షారసం" లేదా "ఈ ద్రాక్షారసం" అని అనువదించవచ్చు.(చూడండి: అన్యాప దేశాలు)

నా రక్తం ద్వారా వచ్చిన కొత్త నిబంధన

"నా రక్తం ద్వారా సాధ్యమయ్యే కొత్త నిబంధన" లేదా "నా రక్తం ద్వారా చట్టపరమయ్యే కొత్త నిబంధన" లేదా "నా రక్తం చిందించబడినప్పుడు, కొత్త నిబంధనకు సూచనగా దేవుడు దానిని స్థాపిస్తాడు. "

మీ కోసం చిందే నా రక్తం

"మీ కోసం మరణంలో చిందే నా రక్తం" లేదా "నేను చనిపోయే టప్పుడు నా గాయాల్లో నుండి కారే నా రక్తం."యేసు తన మరణం గురించి మాట్లాడుతూ, తన శరీరం విరవబడినట్లుగా, తన రక్తం కార్చబడుతున్నట్లుగా ప్రస్తావించాడు. ఇది అన్యాపదేశం.