te_tn/luk/12/35.md

2.2 KiB

(యేసు తన శిష్యులతో మాట్లాడడం కొనసాగిస్తున్నాడు..)

మీ నడుములు కట్టుకుని ఉండండి

ప్రజలు పొడుగాటి దుస్తులు ధరించేవారు. వాళ్ళు పనిచేసేటపుడు అవి అడ్డంగా ఉండకుండా తమ బెల్టుతో గట్టిగా ఉంచుకునే వారు. ఈ అస్పష్టమైన విషయాన్ని తెలియచేసేలా దీనిని ఇలా అనువదించవచ్చు,"మీ బట్టల్ని బెల్టుతో గట్టిగా ఉంచి, పనిచేయడానికి సిద్ధంగా ఉండండి." లేదా "బట్టలు ధరించి సేవచేయడానికి సిద్ధంగా ఉండండి."(చూడండి: స్పష్టమైన, అంతర్గతమైన)

మీ దీపాలు వెలుగుతూ ఉండనివ్వండి

"మీ దీపాలు వెలుగుతూ ఉండాలి"

దీపాలు

వత్తి, మండించడానికి ఒలీవ నూనె వాడే చిన్న పాత్రలు.

యజమాని కోసం ఎదురుచూసే సేవకుల్లా ఉండండి

ఇదొక ఉపమాలంకారం. Simile. తమ యజమాని తిరిగి వస్తాడని సిద్ధంగా ఉన్నట్టు, యేసు తిరిగి వచ్చే టపుడు సిద్ధంగా ఉన్న శిష్యులతో ఇది పోలుస్తున్నది. ఇది ఓక ఉపమానానికి మొదలు కూడా. (చూడండి: ఉపమాలంకారం. Simile, ఉపమానాలు)

పెండ్లి విందు నుండి వచ్చి

"పెండ్లి విందు నుండి ఇంటికి తిరిగి వచ్చి"