te_tn/luk/10/22.md

2.4 KiB

(యేసు ఇప్పుడు తన శిష్యులతో మాట్లాడుతున్నాడు )

"యేసు శిష్యులకు కూడా చెప్పాడు"(యూ డీ బీ) అనే పరిచయ మాటలు కలపడం అవసరం కావొచ్చు.

సమస్తమూ నా తండ్రి నాకు అప్పగించాడు

దీనిని ఇలా అనువదించవచ్చు,"నా తండ్రి సమస్తాన్నీ నాకు అప్పగించాడు" (చూడండి: క్రియాశీల నిష్క్రియాత్మక. Active passive)

కుమారుడు

యేసు తన గురించి తృతీయ పురుష లో చెబుతున్నాడు. (చూడండి: ప్రధమ, ద్వితీయ, తృతీయ పురుష)

కుమారుణ్ణి ఎరుగును

"ఎరుగును" అని తర్జుమా చేసిన పదానికి అర్ధం, వ్యక్తిగత అనుభవంలో నుండి తెలుసుకోవడం. తండ్రి దేవుడు యేసును ఆ విధంగా ఎరుగును.

తండ్రి తప్ప

"కుమారుడెవరో కేవలం తండ్రికే తెలుసు," అని దీని అర్ధం.

తండ్రిని ఎరుగును

"ఎరుగును" అని తర్జుమా చేసిన పదానికి అర్ధం, వ్యక్తిగత అనుభవంలో నుండి తెలుసుకోవడం. యేసు తండ్రి దేవుని ఆవిధంగా ఎరుగును.

కుమారుడు తప్ప

దీని అర్ధం, "తండ్రి ఎవరో కేవలం కుమారునికే తెలుసు."

కుమారుడు ఎవరికి ఆయనను వెల్లడి చేయడానికి ఇష్టపడతాడో

దీనిని ఇలా అనువదించవచ్చు,"కేవలం కుమారుడు తండ్రిని ప్రజలకు వెల్లడి చేయడానికి ఇష్టపడితేనే వారు తండ్రిని ఎరుగుతారు."