te_tn/luk/10/17.md

3.5 KiB

( కొంత కాలమైన తర్వాత 70 మంది శిష్యులు యేసు ఉన్న చోటుకు వచ్చారు.) * డెభ్భై మంది

కొన్ని ప్రతుల్లో 70 బదులు, "72 మంది." అని ఉంది. దీనిని మీరు ఫుట్ నోట్ గా ఉంచవచ్చు.

70 మంది తిరిగి వచ్చారు

యూ డీ బీ లో ఉన్నట్లు మొదట 70 మంది వాస్తవంగా బయటికి వెళ్ళారని కొన్ని భాషల్లో వాడాలి. ఇది అ అవ్యక్త సమాచారం Implicit infomation . దీనిని స్పష్టం చేయాలి. (చూడండి: స్పష్టమైన, అంతర్గతమైన. Explicit and implicit)

సాతాను మెరుపులా ఆకాశం నుండి పడడం చూశాను

తన 70 మంది శిష్యులు పట్టణాలలో బోధిస్తూ ఉన్నపుడు దేవుడు సాతాను ను ఎలా ఓడిస్తున్నాడో అనే దానిని వివరించడానికి యేసు అలంకారాన్ని వాడాడు.

పాములనూ తేళ్ళను తొక్కడానికి ...అధికారం

"పాములను తొక్కడానికి, తేళ్ళను అణగ తొక్కడానికి అధికారం." అనువైన అర్ధాలు: 1) ఇది అసలైన పాములూ తేళ్ళకు సంబంధించినది. లేదా 2) పాములూ తేళ్ళూ అనేవి దురాత్మలకు రూపకం. Metaphor. యూ డీ బీ దీనిని దురాత్మలుగా యిలా అనువదించింది: దురాత్మలను ఎదిరించే అధికారాన్ని నేను మీ కిచ్చాను." (చూడండి: రూపకం. Metaphor.)

పాములనూ తేళ్ళను తొక్కడానికి

అలా చేసినా ఏమీ కాదు అని అర్ధం. దీనిని స్పష్టంగా ఇలా చెప్పవచ్చు," పాములూ తేళ్ళ మీద నడిచినా ఏమీ కాదు."

శత్రువు బలమంతటి మీదా

"శత్రువు బలాన్ని అణగ తొక్కడానికి నేను మీకు అధికారమిచ్చాను"లేదా "శత్రువును ఓడించడానికి నేను మీకు అధికారమిచ్చాను." శత్రువు సాతాను.

అని కాదు... అని సంతోషించండి

"అని కాదు" అనే మాట "దయ్యాలు లోబడుతున్నాయి" అనే మాటకు సంబంధించినది.

మీ పేర్లు పరలోకంలో రాసి ఉన్నాయి

దీనిని ఇలా అనువదించవచ్చు,"దేవుడు మీ పేరుల్ని పరలోకంలో రాశాడు." లేదా " మీ పేరులు పరలోక పౌరుల జాబితా లో ఉన్నాయి"