te_tn/luk/07/11.md

2.3 KiB

ఇది జరిగిన తర్వాత

కథ కొత్త గా మొదలయిందనే సూచనగా ఈ మాట వాడతారు. మీ భాషలో ఇలా వాడే విధానం ఏదైనా ఉంటే, ఇక్కడ దానిని వాడవచ్చు.

ఇదిగో, చనిపోయిన వాణ్ణి

"ఇదిగో" అనే పదం చనిపోయినవానిని కథలో పరిచయం చేస్తున్న తీరు. మీ భాషలో వేరొక రకంగా ఉండవచ్చు. ఇంగ్లీషు లో ఇలా అంటారు,"చనిపోయినవాడు ఒకడు.... "

ఊరి ద్వారం

దీనిని ఇలా అనువదించవచ్చు,"ఊరి పొలిమేర"

అతని తల్లికి ఒక్కగానొక్క కొడుకు

"ఒకామె యొక్క ఒక్కడే కొడుకు"

విధవరాలు

భర్త చనిపోయిన స్త్రీ.

ఆమె పట్ల జాలితో తీవ్రంగా చలించి

"ఆమె పట్ల జాలి పడ్డాడు."

దగ్గరకు వచ్చి

కొన్ని భాషల్లో "ముందుకెళ్ళి" అని గానీ లేదా "ఆ గుంపును సమీపించి" అని అంటారు.

పాడె

శవాన్ని స్మశానానికి తీసుకెళ్ళడానికి వీలుగా వాడే పెట్టె లేదా మంచం లాంటిది. అది శవాన్ని పెట్టే పెట్టె కానక్కరలేదు.

నేను నీతో చెబుతున్నాను

యేసు తన అధికారాన్ని నొక్కి చెప్పడానికి ఇలా చెప్పాడు. "నా మాట విను!" అని దానర్ధం.

చనిపోయినవాడు

"చనిపోయిన వ్యక్తి." ఆ వ్యక్తి ఇంకా చనిపోలేదు, బతికే ఉన్నాడు.