te_tn/2jn/01/01.md

2.7 KiB

పెద్దనైన నేను

అంటే అపోస్తలుడు, యేసు శిష్యుడు అయిన యోహాను. తన వృద్ధాప్యం, లేదా సంఘ నాయకత్వం మూలంగా తనను “పెద్ద ” అని పరిచయం చేసుకుంటున్నాడు. దీన్ని స్పష్టంగా ఇలా చెప్పవచ్చు: “నేను, యోహానును, పెద్దను రాస్తున్నాను.” (చూడండి: స్పష్టమైన, అంతర్గతమైన)

ఎందుకంటే మనలో సత్యం నిలిచి ఉంది, అది శాశ్వతంగా నిలిచి ఉంటుంది

దీన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. “మనం సత్యాన్ని శాశ్వత కాలం నమ్మడం కొనసాగిస్తున్నాం గనక.”

ఎన్నికైన తల్లికీ, ఆమె పిల్లలకూ

గ్రీకు భాషలో లేఖ మొదలు పెట్టేది ఇలానే. దీన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. “నేను, యోహానును, పెద్దను ఈ ఉత్తరం విశ్వాసులైన మీకు రాస్తున్నాను.”

వారందరూ

సాటి విశ్వాసులను సూచించే సర్వ నామం.

నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తూ,

దీన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. “నేను వాస్తవంగా ప్రేమిస్తున్న.”

ఎందుకంటే మనలో సత్యం నిలిచి ఉంది,

పూర్తి అర్థాన్ని స్పష్టం చెయ్యవచ్చు: “ఎందుకంటే యేసు సందేశంలోని సత్యం మనం విశ్వాసం ఉంచాము గనక మనలో శాశ్వత కాలం ఉంటుంది.”

సత్యంలో, ప్రేమలో

దీన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. “అవి సత్యం, మనలను ప్రేమిస్తున్నారు గనక.” ప్రత్యామ్నాయ అనువాదం: “ఎందుకంటే వారు నిజంగా మనల్ని ప్రేమిస్తున్నారు.” (చూడండి: ప్రత్యేక విశేషణం)