te_tn_old/1co/01/intro.md

34 lines
4.5 KiB
Markdown
Raw Blame History

This file contains ambiguous Unicode characters

This file contains Unicode characters that might be confused with other characters. If you think that this is intentional, you can safely ignore this warning. Use the Escape button to reveal them.

# 1 కొరింథీయులకు 01 సాధారణ గమనికలు
## నిర్మాణం మరియు ఆకృతీకరణ
మొదటి మూడు వచనాలు శుభములు. పురాతన సమీప తూర్పు ప్రాంతంలో, ఒక లేఖను ప్రారంభించడానికి ఇది ఒక సాధారణ పద్దతి.
కొన్ని అనువాదాలు పద్యంలోని ప్రతి పంక్తిని కుడి వైపున అమర్చడం వల్ల మిగిలిన వచన భాగాన్ని చదవడం సులభం అవుతుంది. పాత నిబంధన నుండి ఉటంకించిన 19వ వచనంలోని పదాల విషయంలో [ULT] యుఎల్టి దీన్ని చేసింది.
## ఈ అధ్యాయంలోని ప్రత్యేక అంశాలు
### అనైక్యత
ఈ అధ్యాయంలో, సంఘం విభజించబడినందుకు మరియు వేర్వేరు అపొస్తలులను అనుసరించినందుకు పౌలు సంఘాన్ని గద్దించాడు. .(చూడండి: [[rc://*/tw/dict/bible/kt/apostle]])
### ఆత్మ వరములు
ఆత్మ వరములు సంఘానికి సహాయపడుటకు ఇవ్వబడిన ప్రత్యేకమైన అసాధారణమైన సామర్ధ్యాలు. క్రైస్తవులు యేసును విశ్వసించిన తరువాత పరిశుద్ధాత్మ దేవుడు ఈ వరములు ఇస్తాడు. పౌలు ఈ ఆత్మ వరముల జాబితాను 12 వ అధ్యాయంలో ఇచ్చాడు. అభివృద్ధి చెందుతున్న సంఘాన్ని స్థాపిచడoలో సహాయపడటానికి పరిశుద్దాత్మ ఈ వరములలో కొన్నిటిని ఆదిమ సంఘంలో మాత్రమే ఇచ్చాడని కొందరు పండితులు నమ్ముతున్నారు. సంఘ చరిత్ర అంతటిలో క్రైస్తవులందరికీ సహాయపడటానికి ఆత్మ యొక్క అన్ని వరములు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయని ఇతర పండితులు నమ్ముతారు. (చూడండి: [[rc://*/tw/dict/bible/kt/faith]])
## ఈ అధ్యాయంలోని ముఖ్యమైన భాషారూపాలు
### జాతీయాలు
ఈ అధ్యాయంలో, పౌలు రెండు వేర్వేరు పదబంధాలను ఉపయోగించి క్రీస్తు యొక్క రాకడను సూచించాడు: ""మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత"" మరియు ""మన ప్రభువైన యేసుక్రీస్తు దినము."" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-idiom]])
### అలంకారిక ప్రశ్నలు
కొరింథీయులు వర్గాలుగా విభజించబడినందుకు మరియు మానవ జ్ఞానం మీద ఆధారపడినందుకు వారిని గద్దించడానికి పౌలు అలంకారిక ప్రశ్నలను ఉపయోగించాడు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-rquestion]])
## ఈ అధ్యాయంలో ఎదురయ్యే ఇతర అనువాద సమస్యలు
### తొట్రుపాటుకు గురిచేసే అడ్డంకి
ఒక తొట్రుపాటు అనేది ప్రజలు తోట్రుపడే ఒక రాయి లేదా బండ. ఇక్కడ దేవుడు తన మెస్సీయను సిలువ వేయడానికి అనుమతించడం అనేది యూదులు నమ్మడానికి కష్టతరంగా భావించారని అర్థం. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])