te_tn_old/rev/front/intro.md

76 lines
18 KiB
Markdown
Raw Blame History

This file contains ambiguous Unicode characters

This file contains Unicode characters that might be confused with other characters. If you think that this is intentional, you can safely ignore this warning. Use the Escape button to reveal them.

# ప్రకటన గ్రంధం పరిచయం
## భాగం 1: సాధారణ పరిచయం
### ప్రకటన గ్రంధం విభజన
1. ప్రారంభం (1:1-20)
1. ఏడు సంఘములకు ఉత్తరలు (2:1-3:22)
1. పరలోకంలో దేవుని దర్శనం మరియు గొర్రెపిల్ల దర్శనం (4:1-11)
1. ఏడు ముద్రలు (6:1-8:1)
1. ఏడు బూరలు (8:2-13:18)
1. గొర్రెపిల్లను ఆరాధించేవారు (కోత), హత సాక్షులు, మరియు ఉగ్రతలో లోనుండి వచ్చిన పంట (14:1-20)
1. ఏడు పాత్రలు (15:1-18:24)
1. పరలోకంలో జరిగే ఆరాధన(19:1-10)
1. గొర్రెపిల్ల తీర్పు, వేయి సంవత్సరాలు, మృగం నాశనం, సాతాను నాశనం, మరియు చివరి తీర్పు.(20:11-15)
1. నూతన సృష్టి, నూతన యెరూషలేం (21:1-22:5)
1. యేసు రెండవ రాకడ దేవదూతల సాక్షిం,యోహాను యొక్క ముగింపు మాటలు, సంఘమునకు క్రీస్తు యొక్క సందేశం , ఆహ్వానం ,హెచ్చరిక (22:6-21)
### ప్రకటన గ్రంథమును ఎవరు వ్రాశారు?
రచయిత తనను తాను యోహానుగా తెలుపుకున్నాడు. ఈ రచయిత అపొస్తలుడైన యోహాను అయ్యుండవచ్చును. ఈ యోహాను ప్రకటన గ్రంధాన్ని పత్మాసులో ఉండగా రచించాడు. యేసును గూర్చి భోధించినందుకు యోహానును బంధించి పత్మాసు ద్వీపానికి పంపించారు.
### ప్రకటన గ్రంధం దేనిని గురించి తెలుపుతుంది?
ఈ ప్రకటన గ్రంధాన్ని శ్రమలలో ఉన్న విశ్వాసులకు ఆదరణ కలగాలని యోహాను రచించాడు. యోహాను సాతాను గురించి, అతని అనుచరులు విశ్వాసులతో యుద్ధం చేయడం వాళ్ళను హతం చేయడం .వివరించారు ఆ దర్శనాలలో దేవుడు చాలా కఠినమైన సంగతులను భూమి మీద ఉన్న దుష్టులైన ప్రజలను శిక్షించడానికి కలుగచేస్తాడు. చివరిగా అంతంలో సాతనును అతని అనుచరులను యేసు ఓడిస్తాడు. అప్పుడు యేసు నమ్మకముగా ఉన్నవారిని ఆదరిస్తాడు విశ్వాసులు దేవునితో నిత్యము నూతన ఆకాశంలో, భూమి మీద నివసిస్తారు
### ఈ గ్రంధానికి ఏమి పేరు పెట్టగలము?
అనువాదకులు ఈ పుస్తకం పేరు గురించి ఈ విధంగా ఎన్నుకోవచ్చు. “ప్రకటన,” “యేసు క్రీస్తు ప్రత్యక్షత,“ “పరిశుద్ధుడైన యోహాను ప్రత్యక్షత లేదా ”యోహాను“యోహను యొక్క అపొకాలిప్సిస్.” లేదా వారు ఇంకా స్పష్టముగా ఇక్కడ పేర్కొనినట్లుగా పెట్టవచ్చు; “యేసు క్రీస్తు యోహానుకు చూపించిన సంగతులు."" (చూడండి: [[rc://*/ta/man/translate/translate-names]])
### ఈ ప్రకటన గ్రంధంలోని సంగతులు ఏ విధమైన రచనకు సంబంధించినవి?
యోహాను ప్రత్యేకమైన శైలిని ఉపయోగించి అతని దర్శనాలను వివరించాడు. యోహాను చుసిన విషయాలను చిహ్నాలను ఉప్పయోగించి వివరించాడు. లేదా చివరి సంగతులను ఈ విధమైన రచన శైలిని చిహ్నరూప ప్రవచన సాహిత్యం గా లేదా అపొకాలిప్సిక్ గా చెప్పవచ్చు.
## భాగం 2: ముఖ్యమైన భక్తిపరమైన సాంస్కృతిక భావనలు
### ప్రకటన గ్రంధంలోని విషయాలు గతానికి సంబంధించినవా? లేక భవిష్యతుకు సంబంధించినవా?
ఆదిమ క్రైస్తవ కాలం బట్టి, బైబిల్ పండితులు దీనిని వివిధ రకాలుగా వ్యాఖ్యానం చేసియున్నారు. కొంత మంది బైబిల్ పండితులు ఏమి తెలుపుతున్నారంటే యోహాను తన కాలంలో వ్రాసిన సంగతులు గురించి వ్రాశాడని, ఇంకా కొంత మంది బైబిల్ పండితులు తెలపడం ఏమిటంటే యోహాను తన కాలంలో నుండి యేసు ప్రభు తన రెండవ రాకడ వరకు జరిగే సంగతులను వివరించియున్నాడని నమ్ముదురు ఇంకా కొంత మంది బైబిల్. పండితులు ఆలోచించేది ఏమిటంటే యేసుక్రీస్తు రెండవ రాకడ దగ్గరగా జరిగే సంఘటనలను యోహాను వివరించాడని అనుకుంటున్నారు.
ప్రకటన గ్రంధ అనువాదికులు ఏ విధంగా ఈ గ్రంధాన్ని అనువదించాలనే విషయంలో నిశ్చితాభిప్రాయానికి రావలసిన అవసరం లేదు. అనువాదికులు యు.ఎల్.టి(ULT)ఉపయోగించిన కాలాలలోనే ప్రవచనాలను వదిలి వేయాలి లేక తర్జుమా చేయాలి.
### ప్రకటన గ్రంధాన్ని పోలిన పుస్తకం బైబిలు లో ఇంకా ఏమైనా ఉన్నాయా? బైబిలులో ప్రకటన గ్రంధం పోలిన పుస్తకం ఇంకోటి లేదు. అయితే, ప్రకటన గ్ర౦థ౦లో, యెహెజ్కేలు, జెకర్యా, ప్రత్యేక౦గా దానియేలు మధ్య ఉన్న భాగాలు కూడా పోలి ఉన్నాయి. కొన్ని చిత్రాలు మరియు విధానం ఒక్కెలాగ ఉన్నందున, దానియేలు అదే సమయంలో ప్రకటన అనువదించడం ప్రయోజనకరంగా ఉండవచ్చు. భాగం 3: తర్జుమాపరమైన ప్రాముఖ్యమైన విషయాలు
### ఒకరు ప్రకటన గ్రంధాన్ని అనువదించేటప్పుడు దానిని అర్థం చేసుకోవటం అవసరమా?
అనువాదకులు ప్రకటన గ్రంధాన్ని సరిగ్గా అనువదించటానికి ఆ గ్రంధం లోని చిహ్నాలన్నిటిని అర్థం చేసుకోవలసిన అవసరం లేద .అనువదించేటప్పుడు చిహ్నాలు, అంకెల అర్థం లేదా అర్థాలు ఇవ్వకూడదు. (చూడండి: [[rc://*/ta/man/translate/writing-apocalypticwriting]])
### యు.ఎల్.టి (ULT)లోని ప్రకటన గ్రంధంలో “పరిశుద్ధత మరియు పవిత్రీకరణ” అనే పదాలు ఏ విధంగా తెలుపబడ్డాయి?
విభిన్నమైన ఆలోచనలలోని ఒకదానినైన సూచించుటకు లేఖనాలు ఈ పదాలను ఉపయోగించుచున్నాయి. అందువలన తరచుగా ఈ పదాలను అనువాదకులు వివిధ తర్జుమాలలో అనువదించేటప్పుడు కొంతవరకు కష్టంగా ఉంటుంది. ప్రకటన గ్రంధాన్ని ఇంగ్లీష్ భాషలోనికి అనువదించేటప్పుడు యు. ఎల్.టి (ULT)క్రింది సూత్రాలను ఉపయోగిస్తుంది:
* రెండు భాగాలలోని సంగతులు నైతిక పరిశుద్దతను సూచిస్తున్నాయి. ఇక్కడ “పరిశుద్దత” అనే పదాని యు. ఎల్.టి (ULT)ఉపయోగిస్తుంది. (చూడండి: 14:12; 22:11)
* సాధారణముగా ప్రకటన గ్రంథములోని అర్ధం క్రైస్తవులకున్న అనుబంధాన్ని సూచిస్తుంది, వారు ఎటువంటి పాత్ర వహించుకుండానే ఇది వారికి అన్వయించబడుతుంది. ఇటువంటప్పుడు యు.ఎల్.టి. “విశ్వాసి” లేక “విశ్వాసులు” అని ఉపయోగించును. (చూడండి:5:8; 8:3,4: 11:18; 13:7; 16:6; 17:6; 18:20,24; 19:8; 20:9)
*కొన్నిమార్లు ఆ అర్ధం దేవుని కొరకు మాత్రమే ఒకరిని ప్రత్యేకించుట లేక దేనినైనా ప్రత్యేకించుట అనే ఆలోచనను వర్తిస్తుంది. ఇటువంటి సందర్బములో యు.ఎల్.టి(ULT) “పవిత్రీకరణ,” “ప్రత్యేకించుట,” “ప్రతిష్టించుట,“ లేక “దానికొరకు ప్రక్కకు తీసి ప్రత్యేకించిపెట్టుట” అని ఉపయోగిస్తుంది.
తర్జుమాదారులు తమదైన అనువాదములలో ఈ ఆలోచనలను ఎలా తర్జుమా చేయాలనే దానిని గూర్చి వారు ఆలోచించుటకు యు.ఎస్.టి.(UST) అనేక సార్లు సహాయపడుతుంది.
### వివిధమైన కాలాలు
యోహాను వివిధ కాలాలను ప్రకటన గ్రంధంలో సూచించాడు. ఉదాహరణకు . నలభైరెండు నెలలు, ఏడు సంవత్సరాలు మూడున్నర రోజులు. ఇవి సంకేతపరమైన కాలాన్ని తెలియజేస్తున్నాయి అని కొంతమంది బైబిల్ పండితులు చెప్పుతున్నారు. మరి కొంతమంది పండితులు ఇవి కచ్చితమైన కాలాలను సూచిస్తున్నాయి అని చెప్పుతున్నారు. అనువాదకులు దీనిని కచ్చితమైన కాలానికి సంబంధించినవి తీసుకోవాల అప్పుడు వ్యాఖ్యానకర్త వారి ప్రాముఖ్యత ఏమిటన్నదానిని నిర్ణయించుకొనవచ్చును లేక వారు దేనిని తెలియపరచుచున్నారోనన్న విషయమును తెలియజేయుటను నిర్ణయించుకోవచ్చును.
### ప్రకటన గ్రంధములో కీలకమైన భాగాలు లేక విషయాలు ఏమిటి?
క్రింది వచనాలు కొన్ని కొత్త బైబిల్ తర్జుమాలు పాత బైబిల్ తర్జుమాలతో భేదం కలిగి ఉంటాయి యు.ఎల్.టి.(ULT) ఆధునిక లేఖను భాగాలను కలిగియుంటుంది మరియు పాత విషయాలు క్రింది భాగంలో సూచించబడియుంటాయి. స్థానిక ప్రాంతములో బైబిలు తర్జుమా ఉనికిలో ఉన్నట్లయితే, తర్జుమాదారులు అటువంటి తర్జుమాలలో ఉన్నటువంటి లేఖన భాగాలను ఉపయోగించుకోవాలి. ఒకవేళ స్థానిక తర్జుమా లేకపోయినట్లయితే, తర్జుమాదారులు ఆధునిక వాక్యభాగములనే ఉపయోగించుకోవాలి.
* ”’నేను “ఆల్ఫా, ఒమేగా నేనే. ప్రస్తుతముంటూ, పూర్వం ఉండి, భవిష్యత్తులో వచ్చేవాణ్ణి. సర్వశక్తి గలవాణ్ణి” అని సర్వాధికారియైన దేవుడు అంటున్నాడు” (1:8). కొన్ని తర్జుమాలలో “ ఆది, అంతం అని ఉంది”
* “పెద్దలు సాష్టాంగపడి ఆరాధించారు” (5:14). కొన్ని పాత తర్జుమాలలో, “ఇరవై నలుగురు పెద్దలు సాష్టాంగపడి యుగ యుగములు నివసిస్తున్న దేవుడిని ఆరాధించిరి” అని వ్రాయబడింది.
* భూమిలో మూడవ” భాగం కాలిపోయెను” (8: 7). కొన్ని పాత తర్జుమాలలో ఈ వాక్యాన్ని చేర్చలేదు.
* “ప్రస్తుతముంటూ, పూర్వంలో వున్నవాడు” (11:17). కొన్ని తర్జుమాలలో దీనికి కొనసాగింపుగా” రాబోవు వాడు“ అని చేర్చారు.
* “వారు అనింద్యులు” (14:5). కొన్ని తర్జుమాలలో “దేవుని సింహాసనం ముందు” అని వ్రాసియున్నది (14:5). “ఉన్న వాడు, పూర్వం ఉన్న పరిశుద్దుడు” (16:5). కొన్ని పాత తర్జుమాలలో “ఓ ప్రభువా ప్రస్తుతముంటూ, పూర్వం ఉండి, భవిష్యత్తులో ఉండాల్సినవాడవు అని ఉన్నది.
* “జనులు ఆ పట్టణం వెలుగులో సంచరిస్తారు” (21:24). కొన్ని పాత తర్జుమాలలో ఈ విధంగా వుంది రక్షించబడిన జనులు ఆ పట్టణపు వెలుగులో సంచరిస్తారు” .
* తమ వస్త్రాలను ఉతుకున్న వారు ధన్యులు” (22:14). “దేవుని ఆజ్ఞలను గైకొను వారు ధన్యులు” అని కొన్ని పాత తర్జుమాలలో ఉన్నది.
* “దేవుడు జీవ వృక్షం పరిశుద్ద పట్టణంలోని అతని భాగం తీసి వేయును” (22: 19). “ దేవుడు జీవ గ్రంధంలో నుండి, పరిశుద్ద పట్టణంలోనుండి అతని భాగాన్ని తీసి వేయును” అని కొన్ని పాత తర్జుమాలలో ఉన్నది.
(చూడండి: [[rc://*/ta/man/translate/writing-apocalypticwriting]])