te_tn_old/luk/front/intro.md

12 KiB

లూకా సువార్త పరిచయం

భాగం 1:సాధారణ పరిచయం

లూకా సువార్త రూపురేఖ

  1. పరిచయం, గ్రంథం ఉద్దేశం (1:1-4)
  2. యేసు జననం, తన పరిచర్యకోసం సిద్ధబాటు (1:5-4:13)
  3. గలిలయలో యేసు పరిచర్య(4:14-9:50)
  4. యేసు యెరూషలెం ప్రయాణం -శిష్యత్వం (9:51-11:13) -సంఘర్షణ, యేసు దుఃఖం (11:14-14:35) -తప్పిపోవడం, దొరకడం గురించిన ఉపమానాలు. యదార్ధత, కపటం గురించిన ఉపమానాలు (15:1-16:31) -దేవుని రాజ్యం(17:1-19:27) -యేసు యెరూషలెం ప్రవేశం(19:28-44)
  5. యెరూషలేంలో యేసు(19:45-21:4)
  6. తన రెండవ రాకడ గురించి యేసు బోధ(21:5-36)
  7. యేసు మరణం, సమాధి, పునరుత్ధానం(22:1-24:53)

లూకా సువార్త దేనిగురించి చెపుతుంది?

కొత్త ఉపవాక్యంలోని నాలుగు సువార్తలలో లూకా సువార్త ఒకటి. ప్రభువైన యేసు జీవితంలో కొంత భాగాన్ని ఇది వివరిస్తుంది. సువార్తల రచయితలు యేసు జీవితంలోని వివిధ అంశాలనూ, ఆయన చేసినవాటిని గురించి రాసారు. లూకా థియోఫిలా అనే పేరుగల వ్యక్తికి రాసాడు. వాస్తవమైన దానిని గురించి థియోఫిలా నిశ్చయత కలిగియుండునట్లు లూకా ఖచ్చితమైన వివరణ రాసాడు. అయితే తన సువార్త కేవలం థియోఫిలా ని మాత్రమే కాక విశ్వాసులందరినీ ప్రోత్సహించాలని ఎదురుచూశాడు.

ఈ గ్రంథం పేరు ఏవిధంగా అనువదించబడింది?

అనువాదకులు దీని సాంప్రదాయ శీర్షిక “లూకా రాసిన సువార్త” లేక “లూకా రాసిన ప్రకారం సువార్త” అని దీనిని పిలవాలని తలంచవచ్చు. ఇంకా స్పష్టంగా ఉండే పేరుతో పిలువవచ్చు. ఉదాహరణకు, “లూకా రాసిన యేసు శుభవార్త.”(చూడండి:rc://*/ta/man/translate/translate-names)

లూకా గ్రంథాన్ని ఎవరు రాసారు?

ఈ గ్రంథం రచయతను గురించి చెప్పడం లేదు. ఈ గ్రంథాన్ని రాసిన వ్యక్తి అపొస్తలుల కార్యముల గ్రంథాన్ని రాసాడు. అపొస్తలుల కార్యముల గ్రంథంలో కొన్ని భాగాలలో గ్రంథకర్త “మేము” పదాన్ని వినియోగించాడు. అంటే గ్రంథకర్త పౌలుతో ప్రయాణం చేసాడని సూచిస్తుంది. పౌలుతో ప్రయాణం చేస్తున్న ఈ వ్యక్తి లూకా అని ఎక్కువమంది పండితులు తలంచారు. అందుచేత ఆదిమ క్రైస్తవ కాలంనుండి లూకా సువార్త, అపొస్తలుల కార్యముల గ్రంథాలను లూకా రాసాడని ఎక్కువమంది క్రైస్తవులు తలంచారు.

లూకా వైద్యుడు. అతని రచనా శైలిని బట్టి లూకా విద్యావంతుడని చూపిస్తుంది. లూకా బహుశా అన్యుడు కావచ్చును. లూకా తాను సొంతంగా యేసు చెప్పినదానినీ, చేసినదానినీ చెప్పి ఉండకపోవచ్చు. అయితే యేసు చెప్పినవాటిని వినినవారూ, ఆయన చేసినవాటిని చూచినవారితో లూకా మాట్లాడాడనీ లూకా చెప్పాడు.

భాగమ2:మతపరమైనా, సంస్కృతిపరమైనా ప్రాముఖ్య అంశాలు

లూకా సువార్తలో స్త్రీల బాధ్యతలేమిటి?

లూకా తన సువార్తలో స్త్రీలను గురించి అనుకూలంగా వివరించాడు. ఉదాహరణకు, అనేకమంది పురుషులకంటే స్త్రీలు దేవునికి నమ్మకంగా ఉన్నారని తరచుగా చూపించాడు. (చూడండి:rc://*/tw/dict/bible/kt/faithful)

ప్రభువైన యేసుక్రీస్తు జీవితంలోని చివరి వారం గురించి లూకా ఎందుకు ఎక్కువగా రాసాడు?

లూకా ప్రభువైన యేసు చివరివారం గురించి ఎక్కువగా రాసాడు. యేసు చివరి వారం గురించీ, సిలువపై ఆయన మరణం గురించీ తన పాఠకులు లోతుగా ఆలోచన చెయ్యాలని లూకా కోరాడు. మానవులు తనకు వ్యతిరేకంగా చేసిన పాపాన్ని దేవుడు క్షమించేలా యేసు ఇష్టపూర్వకంగా సిలువపై చనిపోయాడని వారు అర్థం చేసుకోవాలని లూకా కోరాడు. (చూడండి:rc://*/tw/dict/bible/kt/sin)

భాగం 3:ప్రాముఖ్యమైన అనువాద సమస్యలు

ఏక దృష్టి సువార్తలు అంటే ఏమిటి?

మత్తయి, మార్కు, లూకా సువార్తలను ఏకదృష్టి సువార్తలు అని పిలుస్తారు. ఎందుకంటే వాటిని ఒకేలా ఉన్న భాగాలు అనేకం ఉన్నాయి. “ఏకదృష్టి” పదం అంటే “కలిపి చూడడం” అని అర్థం.

రెండు లేక మూడు సువార్తలలో కొన్ని వాక్య భాగాలు ఒకేలా ఉండడం లేక దాదాపుగా ఒకేలా ఉంటే వాటిని “సమాంతరం”గా ఉన్నాయని చూడవచ్చు. సమాంతర భాగాలను అనువదించేటప్పుడు అనువాదకులు ఒకే పదజాలాన్ని వినియోగించాలి, సాధ్యమైనంత వరకూ ఒకేలా ఉంచాలి.

యేసు తనను తాను ఎందుకు ‘మనుష్యకుమారుని”గా చెప్పుకొన్నాడు?

సువార్తలలో యేసు తనను గురించి తాను “మనుష్యకుమారునిగా” పిలుచుకొన్నాడు. దానియేలు 7:13-14 వచనభాగానికిది ఉల్లేఖనం. ఈ భాగంలో ఒక వ్యక్తిని “మనుష్యకుమారుడు” అని వివరించబడుతున్నాడు. అంటే ఆ వ్యక్తి మానవునిగా కనిపిస్తున్నాడని అర్థం. మనుష్య కుమారుడు రాజ్యాల మీద శాశ్వతం పరిపాలన చేస్తాడని దేవుడు ఆయనకు అధికారం ఇచ్చాడు. మనుష్యులందరూ ఆయనను శాశ్వతకాలం ఆరాధిస్తారు.

యేసు కాలంలో యూదులు ఎవరినీ “మనుష్యకుమారుడు” అని పిలువలేదు. కాబట్టి నిజంగా ఆయన ఎవరో వారు సరిగా అర్థం చేసుకోవడంలో సహాయం చెయ్యడానికి యేసు ఆ పేరును తనకు తాను వినియోగించుకొన్నాడు. (చూడండి:rc://*/tw/dict/bible/kt/sonofman)

“మనుష్యకుమారుడు” పదాన్ని అనువదించడం అనేక భాషలలో కష్టం కావచ్చును. అక్షరార్థమైన అనువాదాన్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు. అనువాదకులు “మానవుడు” పదం లాంటి ప్రత్యామ్యాయాలను పరిగణించవచ్చు. ఇటువంటి పదాలకు పేజీ అడుగుభాగంలో వివరణ ఇవ్వవచ్చు.

లూకా సువార్త వాక్యభాగంలో ఉన్న ప్రధానమైన అంశాలు ఏమిటి?

ఈ క్రింది వచనాలు ఆరంభ ప్రతులలో లేవు. యు.ఎల్.టి.(ULT), యు.ఎస్.టి.(UST) లు ఈ వచనాలను కలిగియున్నాయి. అయితే కొన్ని వచనాలలో ఇవి లేవు.

*”అప్పుడు పరలోకంనుండి ఒక దేవదూత ఆయనకు ప్రత్యక్ష అయ్యాడు. ఆయనను బలపరచాడు. ఆయన వేదనపడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట, నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలే ఆయెను.” (22:43-44) *యేసు “తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని” చెప్పెను (23:34)

ఈ క్రింది వచనం అనేక ఆధునిక అనువాదాలలో కలవలేదు. కొన్ని అనువాదాలు వాటిని బ్రాకెట్లలో ఉంచారు. ఈ వచనాన్ని అనువదించకూడదని అనువాదకులకు సూచించబడ్డారు. అయితే అనువాదకుల ప్రాంతంలో ఈ వచనాన్ని కలిగియున్న పాత అనువాదాలు ఉన్నట్లయితే అనువాదకులు ఈ వచనాన్ని కలపవచ్చు. ఆ వచనాలను అనువదించినట్లయితే అవి ఆదిమ లూకా సువార్త కాదని సూచించడానికి వాటిని చతురస్రాకార ([]) బ్రాకెట్లలో ఉంచాలి.

*”పండుగ సమయంలో ఒక ఖైదీని విడుదల చెయ్యవలసి ఉంది” (23:17)

(చూడండి:rc://*/ta/man/translate/translate-textvariants)