te_tn_old/luk/24/intro.md

5.4 KiB

లూకా 24 సాధారణ వివరణలు

ఈ అధ్యాయంలోని ప్రత్యేక అంశాలు

యేసును సమాధి చేసిన చోటు ([లూకా 24: 1] (../../luk/24/01.md)) ధనవంతులైన యూదా కుటుంబాల వారు చనిపోయినవారిని సమాధి చేసే చోటు. ఇది ఒక రాతితో తొలచిన గది. ఇది ఒక వైపున చదునైన స్థలాన్ని కలిగి ఉంటుంది, అక్కడ వారు దానిపై నూనె, సుగంధ ద్రవ్యాలు వేసి, వస్త్రంతో శరీరాన్ని చుట్టిన తర్వాత ఉంచేవారు. అప్పుడు వారు సమాధి ముందు ఒక పెద్ద బండను అడ్డుగా దొర్లించే వారు. కాబట్టి ఎవరూ లోపలకు చూడలేరు, లేదా ప్రవేశించలేరు.

మహిళల విశ్వాము

లూకా పాఠకులలో చాలామంది, స్త్రీలకు పురుషులకన్నా తక్కువ ప్రాముఖ్యత కలిగి ఉంటారని అనుకుంటారు, కాని కొంతమంది స్త్రీలు యేసును చాలా ఎక్కువగా ప్రేమించారని, వారు పన్నెండు మంది శిష్యులకన్నా ఎక్కువ విశ్వాసం కలిగి ఉన్నారని లూకా సునిశితంగా కనపరుస్తాడు.

పునరుత్థానం

యేసు భౌతిక శరీరంతో మళ్ళీ బ్రతికి వచ్చాడని తన పాఠకులు అర్థం చేసుకోవాలని లూకా కోరుకుంటాడు ([లూకా 24: 38- 43] (./38.md)).

ఈ అధ్యాయంలో సాధ్యమయ్యే ఇతర అనువాద ఇబ్బందులు

""మనుష్యకుమారుడు""

యేసు తనను తాను ""మనుష్యకుమారుడు"" అని ఈ అధ్యాయంలో పేర్కొన్నాడు ([. లూకా 24: 7] (../../luk/24/07.md)). మీ భాషలో తనను గూర్చి తాను వేరొకరి గురించి మాట్లాడుతున్నట్లుగా,మీ ప్రజలు మాట్లాడటానికి అనుమతించకపోవచ్చు. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/sonofman]]మరియు [[rc:///ta/man/translate/figs-123person]])

""మూడవ రోజు""

యేసు తన అనుచరులకు ""మూడవ రోజున"" మళ్ళీ సజీవునిగా లేస్తానని చెప్పాడు ([లూకా 18:33] (../../luk/18/33.md)). ఆయన శుక్రవారం మధ్యాహ్నం (సూర్యాస్తమయానికి ముందు) మరణించి, తిరిగి ఆదివారం నాడు సజీవుడై లేచాడు, కాబట్టి ఆయన ""మూడవ రోజున"" మళ్ళీ బ్రతికాడు. ఎందుకంటే సూర్యాస్తమయంతో రోజు ప్రారంభమై సూర్యాస్తమయంతో ముగుస్తుందని యూదులు చెప్పినందున వారు రోజులోని ఒక భాగాన్ని ఒక రోజుగా లెక్కించారు. శుక్రవారం మొదటి రోజు, శనివారం రెండవ రోజు, ఆదివారం మూడవ రోజు.

ప్రకాశవంతమైన మెరిసే దుస్తులలో ఉన్న ఇద్దరు వ్యక్తులు

మత్తయి, మార్కు, లూకా, యోహాను అందరునూ, యేసు సమాధి దగ్గర స్త్రీలు ఉండగా తెల్లని వస్త్రాలను ధరించిన దేవదూతలను గురించి రాశారు. ఇద్దరు రచయితలు వారిని మగవారు అని పిలిచారు, ఎందుకంటే దేవదూతలు మానవ రూపంలో ఉన్నందున. ఇద్దరు రచయితలు ఇద్దరు దేవదూతల గురించి రాశారు, కాని మిగతా ఇద్దరు రచయితలు ఒకరి గురించి మాత్రమే రాశారు. ఈ వచన భాగాలలో ప్రతిది యు.ఎల్.టి(ULT) లో ఉన్న విధంగా అనువదించడం ఉత్తమం. (చూడండి: [మత్తయి 28: 1-2] (../../mat/28/01.md)మరియు [మార్కు 16: 5] (../../mrk/16/05.md)మరియు [ లూకా 24: 4] (../../luk/24/04.md)మరియు [యోహాను 20:12] (../../jhn/20/12.md))