te_tn_old/luk/09/intro.md

6.3 KiB

లూకా 09 సాధారణ వివరణలు

ఈ అధ్యాయంలోని ప్రత్యేక అంశాలు

""దేవుని రాజ్యాన్ని బోధించడం"" ఇక్కడ ""దేవుని రాజ్యం"" పదాలు దేనిని సూచిస్తున్నాయో ఖచ్చితంగా ఎవరికీ తెలియదు. ఇది భూమిమీద దేవుని పాలనను సూచిస్తుందని కొందరు అంటారు, మరికొందరు యేసు తన ప్రజల పాపాల కొరకు వెల చెల్లించడానికి చనిపోయాడనే సువార్త సందేశాన్ని సూచిస్తుందని చెపుతారు. దీనిని ""దేవుని రాజ్యం గురించి బోధించడం"" లేదా ""దేవుడు తనను తాను రాజుగా ఏవిధంగా చూపించుకోబోతున్నాడోననే దానిని గురించి వారికి బోధించడం"" అని అనువదించడం ఉత్తమం. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

ఏలీయా

మెస్సీయ రావడానికి ముందు ప్రవక్తయైన ఏలియా తిరిగి వస్తాడని దేవుడు యూదులకు వాగ్దానం చేసాడు. కనుక యేసు అద్భుతాలు చేస్తుడడం చూసిన కొందరు యూదులు ఆయన ఏలియా అని తలంచారు. ([లూకా 9:9])(../../luk/09/09.md), ([లూకా 9:19] (../../luk/09/19.md)). అయితే ఏలియా యేసుతో మాట్లాడటానికి భూమిమీదకు వచ్చాడు ([లూకా 9:30] (../../luk/09/30.md)). (చూడండి: [[rc:///tw/dict/bible/kt/prophet]] మరియు [[rc:///tw/dict/bible/kt/christ]] మరియు rc://*/tw/dict/bible/names/elijah)

""దేవుని రాజ్యం""

""దేవుని రాజ్యం"" పదం ఈ అధ్యాయంలో వినియోగించారు. ఈ పదాలు పలుకబడినప్పుడు భవిష్యత్తులోకూడా ఉండబోయే ఒక రాజ్యాన్ని సూచించడానికి ఉపయోగిస్తున్నారు. (చూడండి: rc://*/tw/dict/bible/kt/kingdomofgod)

మహిమ

తరుచుగా లేఖనాలు దేవుని మహిమను ఒక గొప్ప, అద్భుతమైన వెలుగుగా మాట్లాడుతుంది. మనుషులు ఈ వెలుగును చూసినప్పుడు భయపడతారు. యేసు నిజంగా దేవుని కుమారుడని తన అనుచరులు చూడగలిగేలా యేసు దుస్తులు ఈ మహిమాన్వితమైన వెలుగుతో ప్రకాశించాయని లూకా ఈ అధ్యాయంలో చెప్పాడు. అదే సమయంలో, యేసు తన కుమారుడని దేవుడు వారికి చెప్పాడు. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/glory]] మరియు [[rc:///tw/dict/bible/kt/fear]])

ఈ అధ్యాయంలో సాధ్యమయ్యే ఇతర అనువాద సమస్యలు

వైపరీత్యం

ఒక వైపరీత్యం అంటే అసాధ్యమైన దానిని వివరించడానికి కనిపించే ప్రకటన. ఈ అధ్యాయంలో ఒక ఉదాహరణ: ""తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని పొగొట్టుకొనును, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించు కొనును.” ([లూకా 9:24] (../../luk/09/24.md)).

""మనుష్యకుమారుడు""

యేసు ఈ అధ్యాయంలో తనను తాను ""మనుష్యకుమారుడు"" అని పేర్కొన్నాడు ([లూకా 9:22] (../../luk/09/22.md)). ప్రజలు వేరొకరి గురించి మాట్లాడుతున్నట్లుగా తమ గురించి తాము చెప్పుకోడానికి మీ బాష అనుమతించకపోవచ్చు. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/sonofman]] మరియు [[rc:///ta/man/translate/figs-123person]])

""స్వీకరించడం""

ఈ పదం ఈ అధ్యాయంలో అనేకసార్లు కనిపిస్తుంది, విభిన్న సంగతులను సూచిస్తుంది. ""ఈ చిన్న బిడ్డను నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చు కొనును, నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపినవానిని చేర్చుకొనును, మీ అందరిలో ఎవడు అత్యల్పుడై యుండునో వాడే గొప్ప వాడని” ([లూకా 9:48] (../../luk/09/48.md)), యేసు చెప్పినప్పుడు పిల్లలకి సేవ చేస్తున్న వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాడు. ""వారాయనను చేర్చుకొనలేదు.” ([లూకా 9:53] (../../luk/09/53.md)) అని లూకా చెప్పినప్పుడు, మనుషులు యేసును విశ్వసించలేదు లేదా అంగీకరించలేదు అని అర్థం (చూడండి: rc://*/tw/dict/bible/kt/believe)