te_tn_old/tit/01/intro.md

2.1 KiB

తీతు 01 సాధారణ గమనికలు

నిర్మాణం మరియు ఆకృతీకరణ

పౌలు ఈ పత్రికను 1-4 వచనాలలో అధికారికంగా పరిచయం చేశాడు. పురాతన సమీప తూర్పు ప్రాంతంలో రచయితలు తరచుగా ఈ విధంగా లేఖలను ప్రారంభించేవారు.

6-9 వచనాలలో, సంఘంలో పెద్దగా ఉండే వ్యక్తికి ఉండవలసిన అనేక లక్షణాల జాబితాను రాశాడు. (చూడండి: rc: //te/ta/man/translate/figs-abstract nouns) పౌలు 1 తిమోతి 3 లో ఇలాంటి జాబితానే ఇచ్చాడు.

ఈ అధ్యాయంలోని ప్రత్యేక అంశాలు

పెద్దలు

సంఘ నాయకులకు సంఘం వేర్వేరు శీర్షికలను ఉపయోగించింది. పర్యవేక్షకుడు, పెద్ద, కాపరి మరియు బిషప్ అనే కొన్ని శీర్షికలు చేర్చబడ్డాయి .

ఈ అధ్యాయంలో సాధ్యమయ్యే ఇతర తర్జుమా ఇబ్బందులు

కలిగి ఉండాలి, కావచ్చు, తప్పక

అవసరాలు లేదా బాధ్యతలను సూచించే విభిన్న పదాలను యుఎల్టి ఉపయోగిస్తుంది. ఈ క్రియలు వాటితో సంబంధం ఉన్నశక్తి యొక్క వివిధ స్థాయిలను కలిగి ఉంటాయి. సూక్ష్మ తేడాలు అనువదించడం కష్టం. యుఎస్టి ఈ క్రియలను మరింత సాధారణ మార్గంలో అనువదిస్తుంది.