te_tn_old/rom/14/intro.md

2.7 KiB

రోమా 14 సాధారణ అంశాలు

నిర్మాణము మరియు క్రమపరచుట

చదవడానికి అనుకూలముగా ఉండుటకు కొన్ని అనువాదములలో పద్య భాగమును వేరే వాక్యభాగమునుండి కొంత కుడివైపుకు జరపబడియుండును. పాత నిబంధన వాక్య భాగములోని మాటలను యుఎల్టి(ULT) అనువాదములో ఈ అధ్యాయములోని 11వ వచనములలో ఈ విధంగా చేసియున్నది.

ఈ అధ్యాయములోని విశేష అంశములు

విశ్వాసములో బలహీనత

క్రైస్తవులు నిజమైన విశ్వాసము కలిగియుండి మరియు అదే సమయములో “విశ్వాసములో బలహీనత” కూడా కలిగియుందురని పౌలు బోధించుచున్నాడు. పరిపక్వతలేని, బలహీనమైన లేక అపార్థం చేసుకొనియున్న క్రైస్తవుల విశ్వాసమును ఇది వివరించుచున్నది. (చూడండి: rc://*/tw/dict/bible/kt/faith)

ఆహార నియమాలు

ప్రాచీన తూర్పు దేశములలోని అనేక మాటలు ఆహార నియమాలు కలిగియుండిరి. క్రైస్తవులు తాము కోరుకున్న ఆహారమును భుజించ స్వాతంత్ర్యము కలిగియున్నారు. అయితే ఈ స్వాతంత్ర్యమును వారు ప్రభువును ఘనపరచు విధములో మరియు ఇతరులు పాపము చేయుటకు కారకులు కాకుండా వివేచనతో ఉపయోగించుకొనవలెను. (చూడండి: rc://*/tw/dict/bible/kt/sin)

దేవుని న్యాయపీఠము

దేవుని లేక క్రీస్తు న్యాయపీఠము అనేది క్రైస్తవులతో పాటు, ప్రజలందరూ తాము జీవించిన విధానముకు లేక్కచేప్పవలసిన సమయముకు సాదృశ్యమైయున్నది. .