te_tn_old/rom/13/intro.md

3.0 KiB

రోమా 13 సాధారణ అంశాలు

నిర్మాణము మరియు క్రమపరచుట

ఈ అధ్యాయములోని మొదటి భాగములో, తమను పాలించుచున్న అధికారులకు విధేయులైయుండాలని పౌలు క్రైస్తవులకు బోధించుచున్నాడు. ఆ కాలములో, భక్తిహినులైన రోమా అధికారులు ఆ ప్రాంతమును ఏలుచుండిరి. (చూడండి: rc://*/tw/dict/bible/kt/godly)

ఈ అధ్యాయములోని విశేష అంశములు

భక్తిహిన పాలకులు

అధికారులకు విధేయులైయుండాలని పౌలు బోధించునప్పుడు, దీనిని అర్థం చేసుకొనుటకు కొంతమంది చదువరులకు కొంత కష్టముగా ఉండును, విశేషముగా అధికారులు సంఘమును హింసించు విషయము కష్టకరముగా ఉంటుంది. వారు ఏమి చేయాలని దేవుడు విశేషముగా చెప్పిన సంగతులను క్రైస్తవులు చేయుటకు అధికారులు అనుమతినివ్వనంతవరకు క్రైస్తవులు తమ పాలకులకు లోబడాలి అలాగునే దేవునికి కూడా లోబడాలి. ఈ లోకము అశాశ్వతమని మరియు వారు దేవునితో నిత్యము జీవింతురని క్రైస్తవులు అర్థం చేసుకొనవలెను. (చూడండి: rc://*/tw/dict/bible/kt/eternity)

ఈ అధ్యాయములో ఎదురైయ్యే ఇతర అనువాద ఇబ్బందులు

శరీరము

ఇది క్లిష్టమైన సంగతి. “శరీరము” అనే మాట పాపపు స్వభావముకు రూపకఅలంకారమైయున్నది. మన భౌతిక దేహములు పాపాత్మకముగా ఉన్నవని పౌలు బోధించుటలేదు. క్రైస్తవులు బ్రతికియున్నంత కాలము (“శరీరములో”), మనము పాపము చేయుచుందుమని పౌలు బోధించుచునట్లు కనబడుచున్నది. అయితే మన నూతన స్వభావము మన పాత స్వభావముతో పోరాడుచుండును. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/flesh]] మరియు [[rc:///tw/dict/bible/kt/sin]]) .