te_tn_old/rom/12/intro.md

3.5 KiB

రోమా 12 సాధారణ అంశాలు

నిర్మాణము మరియు క్రమపరచుట

చదవడానికి అనుకూలముగా ఉండుటకు కొన్ని అనువాదములలో పద్య భాగమును వేరే వాక్యభాగమునుండి కొంత కుడివైపుకు జరుపబడియుండును. పాత నిబంధన వాక్య భాగములోని మాటలను యుఎల్టి(ULT) అనువాదములో ఈ అధ్యాయములోని 20వ వచనములో ఈ విధంగా చేసియున్నది.

రోమా.12:1 వచనములో పౌలు “అందువలన” అని ఉపయోగించియున్న పదము 1-11 అధ్యాయములలో చెప్పబడియున్న వాటిని సూచించుచున్నాడని అనేక పండితులు నమ్ముచున్నారు. క్రైస్తవ సువార్తను జాగ్రతగా వివరించియుండి, ఈ గొప్ప సత్యమల వెలుగులో క్రైస్తవులు ఎలా జీవించాలని పౌలు ఇప్పుడు వివరించుచున్నాడు. 12-16 అధ్యాయములు ఒకరు క్రైస్తవ విశ్వాసంలో జీవించు విధము మీద కేంద్రీకృతమైయున్నది. ఈ ప్రయోగాత్మకమైన సూచనలను ఇచ్చుటకు పౌలు అనేకమైన విభిన్న ఆజ్ఞలను ఉపయోగించుచున్నాడు. (చూడండి: rc://*/tw/dict/bible/kt/faith)

ఈ అధ్యాయములోని విశేష అంశములు

క్రైస్తవ జీవితం

మోషే ధర్మశాస్త్రము క్రింద, పశువులు లేక ధాన్యమును దేవాలయ అర్పణములుగా జనులు అర్పింపనవసరము ఉండెను. ఇప్పుడైతే క్రైస్తవులు వారి జీవితములను దేవునికి అర్పణమువలె జీవించాలి. భౌతిక అర్పణములు ఇక అవసరం లేదు. (చూడండి: rc://*/tw/dict/bible/kt/lawofmoses)

ఈ అధ్యాయములోని ప్రాముఖ్యమైన అలంకార పదములు

క్రీస్తు శరీరము

క్రీస్తు శరీరము అనే పదము సంఘమును సూచించు ప్రాముఖ్యమైన రూపకఅలంకారము లేక చిత్రముగా లేఖనాలలో ఉపయోగించబడియున్నది. ప్రతియొక్క సంఘ సభ్యుడు ప్రత్యేకమైన మరియు ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తాడు. క్రైస్తవులకు ఒకరి అవసరం మరియొకరికి ఉన్నది. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/body]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]])