te_tn_old/rom/08/intro.md

7.4 KiB

రోమా 08 సాధారణ అంశాలు

నిర్మాణము మరియు క్రమపరచుట

ఈ అధ్యాయము యొక్క మొట్ట మొదటి వచనమే పరివర్తన వాక్యమైయున్నది. పౌలు 7వ అధ్యాయములోని తన బోధనను ముగించి, 8వ అధ్యాయములోని మాటలలోనికి కొనసాగుచున్నాడు.

కొన్ని తర్జుమాలలో చదువుటకు సులభముగా ఉండుటకు కావ్య భాగములోని ప్రతి పంక్తిని వాక్యభాగములోనే ఉంచకుండగా దాని కుడి వైపున ఉంచుదురు. ఈ విధముగా యుఎల్.టి(ULT) తర్జుమాలో పాత నిబంధన వచనములైన ఈ అధ్యాయములోని 36వ వచనమును అలా పెట్టియున్నారు.

ఈ అధ్యాయములో ప్రత్యేకమైన ఉద్దేశాలు

ఆత్మ నివసించుట

పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి హృదయములో నివసిస్తాడని లేక వారి హృదయములో ఉంటాడని చెప్పబడియున్నది. ఆత్మ ఉన్నట్లయితే, ఆ వ్యక్తి రక్షణను కలిగియున్నాడని అర్థము. (చూడండి: rc://*/tw/dict/bible/kt/save)

“వీరందరూ దేవుని కుమారులు”

ఒక ప్రత్యేకమైన విధానములో యేసు దేవుని కుమారుడైయున్నాడు. దేవుడు క్రైస్తవులను కూడా తన పిల్లలనుగా ఉండునట్లు దత్తత తీసుకొనియున్నాడు. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/sonofgod]] మరియు [[rc:///tw/dict/bible/kt/adoption]])

ముందుగా నిర్ణయించబడుట

”ముందుగ నిర్ణయించబడుట” అని పిలువబడే అంశము మీద పౌలు ఈ అధ్యాయములో బోధించుచున్నాడని అనేకమంది పండితులు నమ్ముదురు. ఇది వాక్యానుసారమైన అంశమైన “నిర్ణయించబడుట” అనే విషయానికి సంబంధించినది. ఇది జగత్తు పునాది వేయబడకమునుపే దేవుడు కొంతమంది నిత్యరక్షణ కలిగియుండుటకు ఎన్నుకొనియున్నాడని సూచించుటకు కొంతమంది దీనిని తీసుకుంటారు. ఈ అంశము మీద బైబిలు ఏమి బోధించుచున్నదనే మీద క్రైస్తవులు అనేక భిన్నాభిప్రాయాలను కలిగియున్నారు. అందుచేత ఈ అధ్యాయమును తర్జుమా చేయునప్పుడు తర్జుమాదారులు అదనపు శ్రద్ధను తీసుకోవలసిన అవసరత ఉన్నది, విశేషముగా ఈ కారణముకు మూలకాల విషయాలకు సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలి. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/predestine]] మరియు [[rc:///tw/dict/bible/kt/save]])

ఈ అధ్యాయములో ప్రాముఖ్యమైన అలంకారిక మాటలు

రూపకఅలంకారము

పౌలు పద్యరూపములో తన బోధనను రూపకఅలంకార రూపములో 38 మరియు 39 వచనాలలో చూపించుచున్నాడు. యేసునందున్న దేవుని ప్రేమనుండి ఏదియు మనలను ఎడబాపనేరదని ఆయన వివరించుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

ఈ అధ్యాయములో ఇతర తర్జుమాపరమైన క్లిష్ట భాగములు

శిక్ష లేదు

సిద్ధాంతపరమైన గలిబిలి సృష్టించబడకుండ ఈ మాటను చాలా జాగ్రత్తగా తర్జుమా చేయాలి. ప్రజలు ఇంకను తమ పాపముల విషయములో అపరాధులైయున్నారు. యేసునందు విశ్వాసముంచినప్పటికీ కూడా పాపులమన్నట్లుగా నడుచుకోవడమును దేవుడు ఒప్పుకొనడు. దేవుడు ఇప్పటికిని విశ్వాసులు పాపము చేసినట్లయితే శిక్షిస్తూనే ఉన్నాడు, అయితే యేసు వారి పాపములకొరకు పొందవలసిన శిక్షను చెల్లించియున్నాడు. దీనినే పౌలు ఇక్కడ చెప్పుచున్నాడు. “శిక్ష” అనే పదముకు అనేకమైన అర్థాలు ఉన్నాయి. అయితే యేసునందు విశ్వాసముంచిన ప్రజలు “నరక పాత్రులుగా” ఉండిన వారి పాపములకొరకు నిత్య శిక్షను పొందుకొనరని పౌలు ఇక్కడ నొక్కి చెప్పుచున్నాడు. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/guilt]] మరియు [[rc:///tw/dict/bible/kt/faith]] మరియు rc://*/tw/dict/bible/kt/condemn)

శరీరము

ఇది సంక్లిష్టమైన విషయము. “శరీరము” అనే పదము మన పాప సంబంధమైన స్వభావముకు రూపకఅలంకారముగా ఉపయోగించబడియున్నది. మన భౌతిక సంబంధమైన శరీరములు పాపసంబంధమైనవని పౌలు బోధించుట లేదు. క్రైస్తవులు బ్రతికియున్నంత కాలము (“శరీరమందు జీవించు కాలము”), మనము పాపము చేస్తూనే ఉంటాము అని పౌలు బోధించునట్లుగా కనబడుతుంది. అయితే మన క్రొత్త స్వభావము మన పాత స్వభావముతో పోరాటము చేస్తూనే ఉంటుంది. (చూడండి: rc://*/tw/dict/bible/kt/flesh మరియు @)