te_tn_old/rev/20/intro.md

3.8 KiB

ప్రకటన 20 సాధారణ అంశములు

ఈ అధ్యాయంలోని విశేషమైన అంశాలు

క్రీస్తు యొక్క వెయ్యేళ్ళ పరిపాలన

సాతాను బంధించిన్నప్పుడు యేసు వెయ్యేళ్ళు పరిపాలించునని ఈ అధ్యాయంలో చెప్పారు. ఇది భవిష్యత్తులో జరుగబోవు సంగతని లేదా యేసు ఇప్పుడు పరలోకము నుండి పరిపాలిస్తున్నాడు అన్న విషయాలపై పండితులు భిన్నాభిప్రాయాలు కలిగియున్నారు. ఈ భాగాన్ని సరిగ్గా తర్జుమా చేయడానికి దీనిని అర్థం చేసుకోవలసిన అవసరం లేదు. (చూడండి: rc://*/tw/dict/bible/kt/prophet)

ఆఖరి తిరుగుబాటు

వెయ్యేళ్ళ పరిపాలన తరువాత ఏమి జరుగునో అన్నదాని గూర్చి కూడా ఈ అధ్యాయం వివరిస్తుంది. ఈ కాలములో, సాతాను మరియు అనేక ప్రజలు యేసుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారు. దీని కారణంగా పాపము, దుష్టత్వం మీద దేవుడు అంతిమ మరియు చివరి విజయమును సాధించును. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/sin]] మరియు [[rc:///tw/dict/bible/kt/evil]] మరియు rc://*/tw/dict/bible/kt/eternity)

మహా ధవళ సింహాసనము

బ్రతికియున్న ప్రజలందరికి దేవుడు తీర్పు తీర్చుటలో ఈ అధ్యాయం ముగిస్తుంది. యేసుని విశ్వసించని ప్రజల నుండి యేసుని విశ్వసించు ప్రజలను దేవుడు వేరుచేస్తారు. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/judge]] మరియు [[rc:///tw/dict/bible/kt/heaven]] మరియు rc://*/tw/dict/bible/kt/faith)

ఈ అధ్యాయంలోని ప్రాముఖ్యమైన అలంకార పదములు

జీవగ్రంథము

ఇది నిత్య జీవముకు రూపకఅలంకారమైయున్నది. నిత్యజీవము పొందువారు తమ పేర్లు జీవగ్రంథములో వ్రాసి ఉందని చెబుతారు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

ఈ అధ్యాయంలో ఎదురైయ్యె ఇతర తర్జుమా ఇబ్బందులు

పాతాళం మరియు అగ్ని సరస్సు

ఇవి రెండు వేవ్వేరు స్థలాలుగా ఉన్నాయి. ఈ రెండు స్థలములను వెవ్వేరుగా ఎలా తర్జుమా చేయాలని అనువాదకులు కొంత పరిశీలన చేయగలరు. తర్జుమా చేయునప్పుడు ఇవి రెండిటిని ఒకే అర్థమొచ్చే విధముగా తర్జుమా చేయకూడదు. (చూడండి: rc://*/tw/dict/bible/kt/hell)