te_tn_old/rev/19/intro.md

2.2 KiB

ప్రకటన 19 సాధారణ అంశములు

విభజన మరియు క్రమము

19వ అధ్యాయము ప్రారంభ భాగము బబులోను పతనమును గురించిన ముగింపు ఇస్తుంది.

కొన్ని అనువాదాలు చదవడానికి సులువుగా ఉండటానికి కవిత్వంలోని ప్రతి పంక్తిని మిగిలిన వచనం కంటే కుడి వైపుకు అమర్చుతాయి. యుఎల్టి(ULT) తర్జుమా ఈ రీతిగా 1-8 వచనాలలో చేసియున్నారు.

ఈ అధ్యాయములోని విశేషమైన అంశములు

పాటలు

ప్రజలు పాటలు పాడు స్థలముగా పరలోకమును గురించి అనేక మార్లు ప్రకటన గ్రంథములో వివరించారు. వారు దేవుని పాటలతో ఆరాధించెదరు. దేవుడు నిత్యమూ ఆరాధించే స్థలముగా పరలోకమున్నదని ఇది తెలియపరచుచున్నది. (చూడండి: rc://*/tw/dict/bible/kt/heaven)

వివాహ మహోత్సవం

వివాహ మహోత్సవం లేక విందు లేఖనాలలో చాలా ప్రాముఖ్యమైన చిత్రమైయున్నది. పరదైసు లేక మరణము తరువాత దేవునితో జీవించడం విందులాగా ఉంటుందని యూదా సంప్రదాయంలో అనేక మార్లు చిత్రీకరించారు. ఇక్కడ, గొర్రెపిల్లయైన యేసు మరియు ఆయన ప్రజలైన పెళ్లి కుమార్తె కొరకు ఏర్పరచబడిన వివాహ మహోత్సవమైయున్నది.