te_tn_old/rev/15/intro.md

2.7 KiB

ప్రకటన 15 సాధారణ అంశములు

విభజన మరియు క్రమము

ఈ అధ్యాయములో యోహాను పరలోకములో సంభవించు సంగతులను గూర్చి వివరించుచున్నాడు.

చదవడానికి సులువుగా ఉండాలని కవిత్వ రూపంలో ఉన్న పంక్తులను మిగిలిన పంక్తులకన్న కుడివైపునకు జరిపియుంచబడియుంటుంది. యుఎల్టి(ULT) తర్జుమా ఈ రీతిగా 3-4 వచనాలలో చేసియున్నారు.

ఈ అధ్యాయంలోని విశేషమైన అంశములు

“క్రూర మృగముపై విజయము”

ఈ ప్రజలు ఆత్మీయంగా విజయవంతులు. అనేకమైన ఆత్మీయ పోరాటాలు కంటికి కనబడవు కానీ ప్రకటన గ్రంథం ఆత్మీయ పోరాటాలను బహిరంగముగా జరుగుతున్నట్లు చూపించుచున్నది. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/spirit]] మరియు [[rc:///ta/man/translate/writing-apocalypticwriting]])

“సాక్ష్యపు గుడారం కలిగిన దేవాలయం పరలోకములో తెరచుకొనెను”

పరలోకములో దేవుని పరిపక్వమైన నివాస స్థలమునకు ప్రతిరూపముగా భౌతిక సంబంధమైన దేవాలయం ఉన్నదని లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఇక్కడ యోహాను దేవుని పరలోక నివాస స్థలము లేదా దేవాలయాన్ని సూచిస్తున్నాడు. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/heaven]] మరియు [[rc:///ta/man/translate/writing-apocalypticwriting]])

పాటలు

ప్రజలు పాటలు పాడు స్థలముగా పరలోకమును గూర్చి అనేక మార్లు ప్రకటన గ్రంథములో వివరించి ఉంది. వారు దేవుని పాటలతో ఆరాధించెదరు. దేవుడు నిత్యమూ ఆరాధించబడు స్థలముగా పరలోకమున్నదని ఇది తెలియపరచుచున్నది.