te_tn_old/rev/12/intro.md

2.5 KiB

ప్రకటన 12 సాధారణ అంశములు

విభజన మరియు క్రమము

కొన్ని అనువాదాలు చదవడానికి సులువుగా ఉండటానికి కవిత్వంలోని ప్రతి పంక్తిని మిగిలిన వచనం కంటే కుడి వైపుకు అమర్చుతాయి. యుఎల్టి(ULT) తర్జుమా ఈ రీతిగా 10-12 వచనాలలో చేసియున్నారు.

ఈ అధ్యాయంలోని విశేషమైన అంశములు

సర్పము

పాత నిబంధన గ్రంథములో వాడబడిన ఊహాత్మక చిత్రాలను ప్రకటన గ్రంధంలో ఉపయోగించారు. ఉదాహరణకు, యోహాను సాతానును ఒక సర్పముకు పోల్చి సూచించుచున్నాడు. ఈ చిత్రము ఏదేను తోటలో సాతాను అవ్వను శోధించిన సంఘటనలోనుండి తీసుకొన్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

ఈ అధ్యాయంలో ఎదురైయే ఇతర తర్జుమా ఇబ్బందులు

“పరలోకములో ఒక గొప్ప సంకేతం కనిపించింది”

ఇక్కడ నిష్క్రియాత్మక పద్దతిలో చెప్పినందున, పరలోకములో ఆ గొప్ప సంకేతం ఎవరు చూసారని యోహాను చెప్పడం లేదు. మీ భాషలో నిష్క్రియ పద్దతి లేనియెడల, విషయం అస్పష్టముగా ఉన్నప్పుడు తర్జుమా చేయడంలో ఇబ్బందులుంటాయి. అనేక ఆంగ్ల తర్జుమాల్లో ఇక్కడ భూత కాలాన్ని ఉపయోగించారు, “పరలోకములో ఒక గొప్ప సంకేతము కనిపించెను” అని చెప్పుతారు. (చూడండి: [[rc:///ta/man/translate/figs-activepassive]] మరియు [[rc:///ta/man/translate/writing-apocalypticwriting]])