te_tn_old/rev/09/intro.md

5.5 KiB

ప్రకటన 09వ అధ్యాయం సాధారణ విషయాలు

నిర్మాణము మరియు క్రమపరచుట

ఈ అధ్యాయంలో దూతలు ఏడు బూరలను ఊదినప్పుడు ఏమి జరుగుతుందనే విషయాలను యోహాను వివరిస్తున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/writing-apocalypticwriting)

శ్రమ

యోహాను ఈ ప్రకటన గ్రంథములో అనేక విధములైన “శ్రమలను” వివరిస్తున్నాడు. 8వ అధ్యాయములోని చివరి భాగంలో ప్రకటించిన మూడు “శ్రమల” వివరణ ఈ అధ్యాయంలో ముందుకు కొనసాగించెను.

ఈ అధ్యాయంలో ప్రత్యేకమైన అంశాలు

ప్రాణికి సంబంధించిన ఊహా చిత్రాలు

ఈ అధ్యాయంలో అనేకమైన ప్రాణులు ఉంటాయి: మిడతలు, తేళ్ళు, గుఱ్ఱములు, సింహాలు మరియు పాములు. ప్రాణులు అనేక విభిన్నములైన గుణగణాలను లేక జాడలను తెలియజేస్తాయి. ఉదాహరణకు, సింహము చాలా శక్తివంతమైనది మరియు అపాయకరమైనది. తర్జుమాదారులు సాధ్యమైనంతవరకు తమ తమ తర్జుమాలలో అవే ప్రాణులను ఉపయోగించాలి. ఒకవేళ ప్రాణి తెలియకపొతే, అదే పోలికతోనూ, గుణగణాలతోనూ ఉన్నటువంటి మరియొక ప్రాణిని ఉపయోగించుకొనవచ్చును.

అగాధం

ఈ చిత్రమును అనేకమార్లు ప్రకటన గ్రంథములో చూస్తాము. తప్పించుకొనుటకు సాధ్యముగాని విధముగా ఉండే నరకమునకు సంబంధించిన చిత్రమైయున్నది మరియు పరలోకానికి విరుద్ధముగా ఉండే చిత్రం. (చూడండి: rc://*/tw/dict/bible/kt/hell)

అబద్దోను మరియు అపొల్యోను

”అబద్దోను” అనేది హెబ్రీ పదం. “అపొల్యోను” అనేది గ్రీకు పదం. ఈ రెండు పదాలకు ‘నాశనం చేయువాడు” అని అర్ధం కలదు. యోహాను హెబ్రీ పదం యొక్క శబ్దాలను ఉపయోగించి, గ్రీకు అక్షరములతో వాటిని వ్రాసియున్నాడు. యుఎల్.టి(ULT) మరియు యుఎస్.టి(UST) తర్జుమా ఆంగ్ల అక్షరములతో ఆ రెండు పదాల శబ్దాలను వ్రాసియున్నవి. మీకివ్వబడిన భాషలోని అక్షరాలను ఉపయోగించి ఈ పదాలను వ్రాయాలని తర్జుమాదారులను ప్రోత్సహించడమైనది. గ్రీకు చదువరులు “అపొల్యోన్” అంటే “నాశనము చేయువాడని” అర్థము చేసుకుంటారు. అందుచేత తర్జుమాదారులు ఈ పదముకుగల అర్థమును వాక్యభాగములోగాని లేక పేజికి క్రింది భాగములోగాని ఇవ్వవలసియుంటుంది. (చూడండి: rc://*/ta/man/translate/translate-transliterate)

పశ్చాత్తాపము

గొప్ప గొప్ప సూచక క్రియలన్నియు కాకుండా, ప్రజలు పశ్చాత్తాపము పొందనివారుగా వివరించబడియున్నారు, తద్వారా వారు పాపములోనే ఉన్నట్లుగా చెప్పబడియున్నారు. ప్రజలు పశ్చాత్తాపపొందుటకు తిరస్కరించియున్నారని 16వ అధ్యాయంలో పేర్కొని ఉన్నారు. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/repent]] మరియు [[rc:///tw/dict/bible/kt/sin]])

ఈ అధ్యాయములో ప్రాముఖ్యమైన అలంకారములు

ఉపమానము

యోహాను ఈ అధ్యాయంలో అనేకమైన ఉపమానములను ఉపయోగించియున్నాడు. దర్శనములో తాను చూసిన చిత్రములన్నియు వివరించుటకు అవి సహాయకరముగా ఉంటాయి. (చూడండి: rc://*/ta/man/translate/figs-simile)