te_tn_old/rev/07/intro.md

3.1 KiB

ప్రకటన 07వ అధ్యాయం సాధారణ విషయాలు

నిర్మాణము మరియు క్రమపరచుట

పండితులు ఈ అధ్యాయంలోని భాగాలను అనేక విధానములలో వ్యాఖ్యానం చేశారు. ఈ అధ్యాయంలో ఉన్న విషయాలన్నిటిని ఉన్నది ఉన్నట్లుగా తర్జుమా చేయుటకు తర్జుమాదారులు ఈ అధ్యాయాన్ని సంపూర్ణముగా అర్థము చేసుకొనవలసిన అవసరత లేదు. (చూడండి: rc://*/ta/man/translate/writing-apocalypticwriting)

ఈ అధ్యాయం లోనున్న పెద్ద సంఖ్యను ఉన్నది ఉన్నట్లుగా తర్జుమా చేయడం చాలా ప్రాముఖ్యమైన విషయం. 144,000 అనే సంఖ్య పన్నెండు వేలకు పన్నెండు రెట్లు ఎక్కువ చేసినప్పుడు వచ్చే సంఖ్య అది.

పాత నిబంధనలో సాధారణముగా ఇశ్రాయేలీయుల పన్నెండు గోత్రీకులను పట్టిక చేసినట్లుగా ఈ అధ్యాయయంలో వారిని పట్టిక చేయలేదని తర్జుమాదారులు గమనించాలి.

కొన్ని తర్జుమాలలో చదవడానికి సులభంగా ఉండుటకు కొన్ని తర్జుమాలు పాతనిబంధన నుండి తీసిన కొన్ని వ్యాఖ్యలు పేజిలో కుడి వైపున పెట్టి ఉంటారు. 5-8 మరియు 15-17వచనములలో క్రోఢీకరించిన మాటలను తీసి యుఎల్.టి(ULT) తర్జుమాలో అదే విధముగా పెట్టడం జరిగింది.

ఈ అధ్యాయములో ప్రత్యేకమైన ఉద్దేశములు లేక అంశాలు

ఆరాధన

దేవుడు తన ప్రజలను రక్షించును మరియు వారిని శ్రమల కాలముల ద్వారా తీసుకు వెళ్లును. ఆయన ప్రజలు ఆయనను ఆరాధించుదురు. (చూడండి: rc://*/tw/dict/bible/kt/worship)

ఈ అధ్యాయములో ప్రాముఖ్యమైన అలంకారములు

గొర్రెపిల్ల

ఇది యేసును సూచిస్తుంది. ఈ అధ్యాయంలో ఈ పేరు యేసు కొరకే పెట్టబడియున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)