te_tn_old/rev/06/intro.md

3.6 KiB

ప్రకటన 06వ అధ్యాయం సాధారణ విషయాలు

నిర్మాణము మరియు క్రమపరచుట

గొర్రెపిల్ల ఆరు ముద్రలను ఒక్కొక్కటిగా విప్పిన తరువాత ఏమి జరిగిందనే విషయాలను గ్రంథకర్త వివరించుచున్నాడు. 8వ అధ్యాయం వరకు గొర్రెపిల్ల ఏడవ ముద్రను విప్పలేదు.

ఈ అధ్యాయంలో ప్రత్యేకమైన అంశాలు

ఏడు ముద్రలు

యోహాను కాలములో రాజులు మరియు ప్రాముఖ్యమైన ప్రజలు ప్రాణుల చర్మముల మీద లేక కాగితపు పెద్ద పెద్ద ముక్కల మీద ప్రాముఖ్యమైన విషయాలను వ్రాసియుండిరి. ఆ తరువాత వారు వాటిని చుట్టి, వాటి మీద కరిగించిన మైనమును వేసి కట్టి వేస్తారు. తద్వారా ఆ చుట్ట విడిపోకుండా కట్టబడియుండును. ఆ చుట్ట లేక పత్రిక ఏ వ్యక్తికి వ్రాయబడియుంటుందో ఆ వ్యక్తి మాత్రమే ఆ ముద్రను తీసి తెరుచుటకు అధికారమును కలిగియుంటాడు.(చూడండి: rc://*/ta/man/translate/writing-apocalypticwriting)

నలుగురు గుర్రపు సవారి చేయువారు

గొర్రెపిల్ల మొదటి నాలుగు ముద్రలను విప్పి తెరచినప్పుడు, నలుగురు వ్యక్తులు వివిధమైన రంగులు కలిగిన నాలుగు గుర్రముల మీద సవారి చెస్తూ వస్తున్నవారిని గ్రంథకర్త వివరించుచున్నాడు. సవారి చేస్తూ వస్తూ ఉన్నవాడు భూమిపై ఏ విధముగా ప్రభావం చూపగలడనే విషయానికి చిహ్నముగా గుర్రములకు రంగులను కలిగియుండవచ్చును.

ఈ అధ్యాయంలో ప్రాముఖ్యమైన అలంకారములు

గొర్రెపిల్ల

ఇది యేసును సూచించుచున్నది. ఈ అధ్యాయములో ఈ పేరు యేసు కొరకు కూడా ఇవ్వబడియున్నది. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/lamb]] మరియు [[rc:///ta/man/translate/figs-explicit]])

ఉపమానములు

12-14 వచనములలో గ్రంథకర్త తాను చూసిన దర్శనములోని చిత్రాలను వివరించుటకు అనేకమైన ఉపమానములను ఉపయోగించుచున్నాడు. అతను ఆ చిత్రాలను దైనందిన విషయాలకు పోల్చి చెప్పుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-simile)