te_tn_old/rev/03/intro.md

5.4 KiB
Raw Permalink Blame History

ప్రకటన 03వ అధ్యాయం సాధారణ విషయాలు

నిర్మాణం, క్రమపరచుట

2 మరియు 3 అధ్యాయములను కలిపి సాధారణముగా “ఏడు సంఘాలకు ఏడు పత్రికలు” అని పిలుస్తారు. మీరు వాటిని విడదీసి వెవ్వేరు అధ్యాయాలుగా పరిగణించవచ్చును. తద్వారా చదివే వారు అవి విడతీసియుండుటను సులభంగా గుర్తించి చూచును.

కొన్ని తర్జుమాలలో పాత నిబంధన నుండి తీసిన వ్యాఖ్యలను వాక్యభాగంలో కాకుండా ఆ పేజిలోనే కుడి ప్రక్కన పొందుపరిచ్చారు. 7వవచనలో క్రోఢీకరించిన వాక్యాలను యు.ఎల్.టి(ULT) ఆ ప్రకారమే చేసియున్నది.

ఈ అధ్యాయంలో ప్రత్యేకమైన అంశాలు

దేవుని ఏడు ఆత్మలు

ఈ ఏడు ఆత్మలు [ప్రకటన.1:4] (../../ప్రకటన/01/04.md) వచనములోనున్న ఏడు ఆత్మలైయున్నవి.

ఏడు నక్షత్రములు

ఈ ఏడు నక్షత్రములు [ప్రకటన.1:20] (../../rev/01/02.md) వచనంలో ఏడు నక్షత్రాలు ఉన్నాయి.

ఈ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైన అలంకారాలు

చూడు, నేను ద్వారం దగ్గర నిలిచి, తలుపు తట్టుచున్నాను

లవదొకియలోని క్రైస్తవులందరూ ఆయన ఇష్టానికి లోబడి ఉండాలి అని యేసు ప్రభువు మాట్లాడాడు, అది ఎలాగునంటే ఒక మనిషి ఒక ఇంటికి వచ్చి, ఆ ఇంటి తలుపు దగ్గర నిలచి, లోపలికి రావడానికి, వారితో కలిసి భోజనం చేయుటకు ఆ ఇంటి ప్రజల అనుమతిని కోరుచున్నట్లుగా యేసు ప్రభువు చెప్పుచున్నాడు ([ప్రకటన.3:20] (../../rev/03/20.md)). “సంఘాలకు ఆత్మ చెప్పుచున్నమాట చెవిగలవాడు వినునుగాక”

తన చదువరులందరికి భౌతికమైన చెవులు ఉన్నాయని రచయితకు తెలుసు. ఇక్కడ చెవి అనే పదం దేవుడు చెప్పుచున్నవాటిని వినుటకొరకు, ఆయన లోబడుటకు ఆశను కలిగియుండుటకు పర్యాయ పదంగా ఉపయోగించారు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

ఈ అధ్యాయంలో తర్జుమాపరమైన కీలక విషయాలు

“సంఘపు దూత”

”దూత” అనే పదం ఇక్కడ “సందేశవాహకుడు” అని అర్ధం ఇచ్చుచున్నది. ఇది బహుశః సందేశవాహకుడిని లేక సంఘ నాయకుడిని సూచించును. [ప్రకటన.1:20] (../../rev/01/20.md) వచనములో “దూత” అనే పదంను ఏ విధముగా తర్జుమా చేశారో చూడండి.

“ఒకని మాటలు”

ఈ మాటలతో ఉన్న వచనాలను తర్జుమా చేయడం చాలా కష్టంగాగా ఉండవచ్చు. వారు సంపూర్ణ వచనాలుగా వ్రాయరు. మీరు తప్పకుండ అటువంటి మాటలకు ముందు భాగంలో “ఇవన్ని లేక ఈ మాటలన్ని” అనే పదాలను చేర్చవలసియుంటుంది. ఈ మాటలన్ని ఇతర వ్యక్తిని గూర్చి మాట్లాడుచున్నట్లుగా యేసు ప్రభువు తనను గూర్చి చెప్పుటకు ఈ మాటలను ఉపయోగించియున్నాడు. మీ భాషలో ప్రజలు తమను గురించి మాట్లాడుతూ, ఇతరులను గురించి మాట్లాడానికి అనుమతించకపోవచ్చు. యేసు [ప్రకటన.1:17] (../../rev/01/17.md) వచనంలో మాట్లాడటం ప్రారంభించాడు. ఆయన 3వ అధ్యాయం చివరి వరకు మాట్లాడటం కొనసాగిస్తున్నాడు.