te_tn_old/rev/02/intro.md

5.9 KiB

ప్రకటన 02వ అధ్యాయం సాధారణ విషయాలు

నిర్మాణం, క్రమపరచుట

2, 3 అధ్యాయాలను కలిపి సాధారణంగా “ఏడు సంఘాలకు ఏడు పత్రికలు” అని పిలుస్తారు. మీరు వాటిని విడదీసి వెవ్వేరు అధ్యాయాలుగా పరిగణించవచ్చును. తద్వారా చదివేవారు అవి విడతీసినవాటిని సులభంగా గుర్తించి చూస్తారు.

కొన్ని తర్జుమాలలో పాత నిబంధన నుండి తీసిన వ్యాఖ్యలను వాక్యభాగంలో కాకుండా ఆ పేజిలోనే కుడి ప్రక్కన అమర్చి ఉంటారు. 27వ వచనంలో క్రోడీకరించిన వాక్యాలను యు.ఎల్.టి(ULT) ఆ ప్రకారమేచేసింది.

ఈ అధ్యాయంలో ప్రత్యేకమైన అంశాలు

పేదరికం, ధనికం

స్ముర్నలోని క్రైస్తవులు చాలా పేదవారు ఎందుకంటే వారి దగ్గర ఎక్కువ డబ్బులు లేవు. అయితే వారు ఆత్మీయంగా ధనవంతులు ఎందుకంటే దేవుడు వారి శ్రమలకు ప్రతిఫలం ఇచ్చారు. (చూడండి: rc://*/tw/dict/bible/kt/spirit)

“దెయ్యం దేనిని గూర్చి ఉన్నది”

ప్రజలు స్ముర్నలోని కొంతమంది క్రైస్తవులను పట్టుకొని, చెరసాలలో వేసిరి, వారిలో కొంతమందిని చంపిరి ([ప్రకటన.2:10] (../../rev/02/10.md)). ఈ ప్రజలు ఎవరన్న విషయాన్ని యోహాను చెప్పలేదు. అయితే క్రైస్తవులను హింసించటం అనేది సాతానే నేరుగా హింసించుచున్నాడన్నట్లుగా హింసిస్తున్నాడు అని మాట్లాడుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

బిలాము, బాలాకు, యెజెబేలు

బిలాము, బాలాకు, యెజెబేలు అనేవారు యేసు పుట్టక ముందే ఎంతో కాలం క్రితం జీవించినవారు. వారు ఇశ్రాయేలీయులను శపించుట ద్వారా లేక వారు దేవునికి లోబడకుండా చేయటం ద్వారా చంపాలని ప్రయత్నం చేసిరి.

ఈ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైన అలంకారాలు

“సంఘాలకు ఆత్మ చెప్పుచున్న మాట చెవులు ఉన్నవాడు వింటాడు”

తన చదువరులందరికి భౌతికమైన చెవులు ఉన్నాయని రచయితకు తెలుసు. ఇక్కడ చెవి అనే పదం దేవుడు చెప్పుచున్నవాటిని వినుటకొరకు వినడం ఆయనకు లోబడుటకు ఆశను కలిగి ఉండడానికి పర్యాయ పదంగా ఉపయోగించారు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

ఈ అధ్యాయంలో తర్జుమాపరమైన కీలక విషయాలు

“సంఘం దూత”

”దూత” అనే పడం ఇక్కడ “సందేశవాహకుడు” అని అర్ధం ఇస్తుంది. ఇది బహుశః సందేశవాహకుడిని లేక సంఘ నాయకుని సూచిస్తుంది. [ప్రకటన.1:20] (../../rev/01/20.md) వచనంలో “దూత” అనే పదంను ఏ విధముగా తర్జుమా చేశారో చూడండి.

“ఒకని మాటలు”

ఈ మాటలతోనున్న వచనాలను తర్జుమా చేయడం చాలా కష్టముగా ఉండవచ్చు. వారు సంపూర్ణ వచనాలుగా వ్రాయరు. మీరు తప్పకుండ అటువంటి మాటలకు ముందు భాగంలో “ఇవి అని లేక ఈ మాటలన్ని” అనే పదాలను చేర్చవలసి ఉంది. ఈ మాటలన్ని ఇతర వ్యక్తిని గూర్చి మాట్లాడుచున్నట్లుగా యేసు ప్రభువు తనను గూర్చి చెప్పుటకు ఈ మాటలను ఉపయోగించెను. మీ భాషలో ప్రజలు తమను గూర్చి మాట్లాడుతూ, ఇతరులను గూర్చి మాట్లాడుటకు అనుమతించకపోవచ్చును. యేసు [ప్రకటన.1:17] (../../rev/01/17.md) వచనంలో మాట్లాడుటకు ఆరంభించేను. ఆయన 3వ అధ్యాయం చివరి భాగం వరకు మాట్లాడం కొనసాగించేను.