te_tn_old/rev/01/intro.md

6.1 KiB

ప్రకటన గ్రంధం 01 సాధారణ విషయాలు

నిర్మాణం, క్రమం

పత్మాసు ద్వీపంలో యోహాను పొందిన దర్శనమును ప్రకటన గ్రంథములో ఏ విధంగా ఉన్నది అన్న విషయాన్ని ఈ అధ్యాయం వివరిస్తుంది.

చదవడానికి సులభంగా ఉండడానికి కొన్ని తర్జుమాలు పాతనిబంధన నుండి తీసిన కొన్ని వ్యాఖ్యలు పేజిలో కుడి వైపున పెట్టి ఉంటారు. 7వ వచనంలో పొందుపరిచిన మాటలను తీసి యు.ఎల్.టి(ULT) తర్జుమాలో అదే విధంగా పెట్టడం జరిగింది.

ఈ అధ్యాయంలో ప్రత్యేకమైన ఉద్దేశాలు లేక భావనలు

ఏడు సంఘములు

యోహాను భక్తుడు ఈ పుస్తకాన్ని చిన్నాసియాలోని అనగా ఇప్పటి టర్కీ దేశములోని ఏడు సంఘములకు వ్రాసియున్నాడు.

తెలుపు

”తెలుపుగా” ఉన్నటువంటి ఒక వ్యక్తికి సంబంధించిన దానిని గూర్చి బైబిలు తరచుగా మాట్లాడుచున్నది. ఒక వ్యక్తి సరియైన రీతిలో జీవించుచున్నాడని, దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నాడని తెలుపుటకు దీనిని రూపకఅలంకారంగా, పర్యాయ పదంగాను ఉపయోగించియుంది. (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు rc://*/tw/dict/bible/kt/righteous)

”ఉన్నవాడు, ఉండినవాడు, మరియు రాబోవువాడు”

దేవుడు ఇప్పటికి ఉనికిలో ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడు ఉన్నవాడు. ఆయన ఎల్లప్పుడు ఉండువాడైయున్నాడు. ఈ మాటలను మీ భాషలో వేరొక విధంగా చెప్పవచ్చునేమో.

ఈ అధ్యాయంలో ప్రాముఖ్యమైన అలంకారిక మాటలు

రక్తము

రక్తము అనేది మరణానికి పర్యాయ పదంగా ఉంది. యేసు “తన రక్తం ద్వారా మన పాపముల నుండి మనలను విడుదల చేసేను.” యేసు మనకొరకు మరణించుట ద్వారా ఆయన మన పాపములనుండి మనలను రక్షించేను” అని యోహాను మాటలకు అర్ధం. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

ఈ అధ్యాయంలో తర్జుమాపరమైన ఇతర క్లిష్ట భాగాలు

“ఆయన మేఘముల మీద రానైయున్నాడు”

దేవుడు యేసును మరణం నుండి పైకి లేపిన తరువాత ఆయన ఆకాశంలోనికి వెళ్ళుచున్నప్పుడు యేసు మేఘలలోనికి కొనిపోబడెను. యేసు తిరిగి వచ్చినప్పుడు, ఆయన “మేఘలతో పాటు” తిరిగి రానైయున్నాడు. ఆయన మేఘాల మీద కూర్చొని వస్తాడా లేక మేఘాల మీద నడుచుకొని వస్తాడా లేక మేఘాలలోనుండి వస్తాడా లేక మేఘాలతోపాటు వస్తాడా” లేక ఇంకొక రీతిగా వస్తాడా అని స్పష్టముగా లేదు. మీ భాషలో స్వాభావికముగా వ్యక్తపరచు విధముగానే మీ తర్జుమా కూడా ఈ మాటలను వ్యక్తపరచాలి.

“ఒకటేమో మనుష్య కుమారునివలె ఉన్నది”

ఇది యేసును సూచిస్తున్నది. సువార్తలలో యేసు తననుతాను “మనుష్య కుమారుడు” అని పిలుచుకొనినప్పుడు మీరు ఆ పదాలను తర్జుమా చేసినట్లుగానే అదే పదాలను ఉపయోగించి “మనుష్య కుమారుడు” అనే పదాలను తర్జుమా చేయాలి.

“ఏడు సంఘముల దూతలు”

“దూతలు” అనే పదంకు ఇక్కడ “సందేశవాహకులు” అని అర్ధం ఉంటుంది. ఇది బహుశ పరలోకంలో ఉండేవారు అని కూడా సూచిస్తుంది, లేక ఏడు సంఘాల నాయకులు లేక సందేశవాహకులు అని కూడా సూచిస్తుంది. యోహాను “దూత” (ఏకవచనం) అనే పదాన్ని 1వ వచనంలోను, పుస్తక భాగమంతటిలో అనేక స్థలాలలోను ఉపయోగించారు. మీ తర్జుమాలో కూడా అదే పదాన్ని ఉపయోగించాలి.