te_tn_old/php/front/intro.md

10 KiB

ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక

భాగము 1: సాధారణ పరిచయం

ఫిలిప్పీ పత్రిక యొక్క విభజన

  1. శుభములు, కృతజ్ఞతాస్తుతులు మరియు ప్రార్థన (1:1-11)
  2. పౌలు యొక్క సేవను గూర్చిన నివేదిక (1:12-26)
  3. సూచనలు
  • నిలకడగా ఉండుట (1:27-30)
  • ఐక్యత కలిగియుండుట (2:1-2)
  • వినయము కలిగియుండుట (2:3-11)
  • మనలో దేవుడు పనిచేయడంతో పాటు మన రక్షణ కూడా కార్యం చేయవలసియున్నది (2:12-13)
  • నిష్కలంకులు మరియు వెలుగుగా ఉండుట (2:14-18)
  1. తిమోతి మరియు ఎపఫ్రొదితు (2:19-30)
  2. అబద్ధ బోధకులను గూర్చిన హెచ్చరిక (3:1-4:1)
  3. వ్యక్తిగత సూచన (4:2-5)
  4. సంతోషించుడి మరియు చింతించవద్దు (4:4-6)
  5. తుది వ్యాక్యలు
  • విలువలు (4:8-9)
  • సంతుష్టి (4:10-20)
  • తుది శుభములు (4:21-23)

ఫిలిప్పీ పత్రికను ఎవరు వ్రాసారు?

పౌలు ఫిలిప్పీ పత్రికను వ్రాసాడు. పౌలు తార్సు ఊరుకు చెందినవాడైయుండెను. అతను ఇంతకుముందు సౌలు అని పిలవబడేవాడు. పౌలు క్రైస్తవుడు కాకముందు అతను ఒక పరిసయ్యుడైయుండెను. అతడు క్రైస్తవులను హింసిచెను. అతడు క్రైస్తవుడుగా మారిన తరువాత రోమా సాంమ్రాజ్యమునకు అనేక మార్లు వెళ్లి యేసును గూర్చి ప్రజలకు చెప్పాడు.

రోమా చెరసాలలో ఉన్నప్పుడు పౌలు ఈ పత్రికను రాసాడు.

ఫిలిప్పీ పత్రిక దేని గూర్చి మాట్లాడుచున్నది?

మాసిదోనియా పట్టణమునకు చెందిన ఫిలిప్పీ పట్టణ విశ్వాసులకు పౌలు ఈ పత్రికను వ్రాసాడు. అతనికి వాళ్ళు పంపిన కానుకకు కృతజ్ఞతలు తెల్పుటకు ఈ పత్రికను వ్రాసాడు. అతడు చెరసాలలో ఎలా ఉన్నాడని అతడు చెప్పనుద్దేశించియుండెను మరియు వారు శ్రమలలో ఉన్నప్పటికి ఆనందించాలని వారిని అతడు ప్రోత్సహించాడు. ఎపఫ్రొదీతు అనే ఒక వ్యక్తిని గూర్చి అతను వారికి వ్రాసాడు. అతడే పౌలుకు ఆ కానుకను తెచ్చియుండెను. పౌలును దర్శించుటకు వచ్చినప్పుడు, ఎపఫ్రొదీతు రోగి అయ్యాడు. అందువలన, అతనిని తిరిగి ఫిలిప్పీకి పంపించాలని పౌలు నిర్ణయించుకున్నాడు. ఎపఫ్రొదీతు వెనుదిరిగినప్పుడు అతడిని స్వాగతించాలని మరియు అతనిపట్ల కనికరం కలిగియుండాలని పౌలు ఫిలిప్పీ విశ్వాసులను ప్రోత్సహించాడు.

ఈ పుస్తక శీర్షికను ఎలా తర్జుమా చేయాలి?

అనువాదకులు ఈ పుస్తకమును దాని సాంప్రదాయక పేరైన “ఫిలిప్పీ పత్రిక” అని పిలవవచ్చు. లేక “ఫిలిప్పీలోని సంఘమునకు పౌలు వ్రాసిన పత్రిక” లేక “ఫిలిప్పీలోని క్రైస్తవులకు వ్రాసిన పత్రిక” అనే స్పష్టమైన పేరును వాడవచ్చును. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

భాగము 2: భక్తిపరమైన మరియు సంస్కృతిపరమైన ముఖ్య అంశములు

ఫిలిప్పీ పట్టణము ఎలా ఉండెను?

మహా అలెగ్జాండర్ తండ్రియైన ఫిలిప్, మాసిదోనియా ప్రాంతములోని ఫిలిప్పీని కనుగొన్నాడు. ఫిలిప్పీ పట్టనస్తులు కూడా రోమా పౌరులుగా పిలువబడిరి అని దీని అర్థము. ఫిలిప్పీ పట్టనస్తులు రోమా పౌరసత్వము పొందుకొనియుండుటను గర్వంగా ఎంచిరి. అయితే వారు పరలోక పౌరులైయున్నారని విశ్వాసులతో పౌలు చెప్పెను (3:20).

భాగము 3: ప్రాముఖ్యమైన తర్జుమా ఇబ్బందులు

ఏకవచనము మరియు బహువచనము “మీరు”

ఈ పుస్తకములో, “నేను” అనే పదము పౌలును సూచించుచున్నది. “మీరు” అనే పదము అనేక మార్లు బహువచనముగా వాడబడియున్నది మరియు ఫిలిప్పీలోని విశ్వాసులను సూచించుచున్నది. 4:3వ వచనములో ఇది మినహాయించబడియున్నది. (చూడండి: [[rc:///ta/man/translate/figs-exclusive]] మరియు [[rc:///ta/man/translate/figs-you]])

ఈ పత్రికలో చెప్పబడిన “క్రీస్తు సిలువకు శత్రువులు” (3:18) ఎవరు?

బహుశః దేవుని ఆజ్ఞలను గైకొనక, తమను తాము విశ్వాసులు అని పిలుచుకొనుచున్న ప్రజలు “క్రీస్తు సిలువకు శత్రువులైయుండవచ్చు”. క్రీస్తులోని స్వాతంత్ర్యంలో వారు ఏమైనా చేయవచ్చని మరియు దేవుడు వారిని శిక్షించడని వారు తలంచారు (3:19).

ఈ పత్రికలో “సంతోషం” మరియు “ఆనందం” అనే పదాలను పదే పదే ఎందుకు ఉపయోగించబడియున్నది?

ఈ పత్రికను వ్రాసినప్పుడు పౌలు చెరసాలలో ఉండెను (1:7). అతడు శ్రమపడుచున్నప్పటికి, యేసు క్రీస్తు ద్వారా దేవుడు అతని పట్ల కనికరము కలిగియున్నాడని అందునుబట్టి పౌలు అనేక మార్లు అతడు సంతోషించుచున్నాడని చెప్పెను. యేసు క్రీస్తులో అదే నమ్మకము అతని చదువరులు కలిగియుండాలని వారిని అతడు ప్రోత్సహించనుద్దేశించియుండెను. (చూడండి: rc://*/ta/man/translate/figs-irony)

“క్రీస్తులో”, “ప్రభువులో” మొదలగు పదములను ఉపయోగించుటలో పౌలు ఏ ఉద్దేశ్యమును కలిగియుండెను?

ఇటువంటి పదాలు 1:1, 8, 13, 14, 26, 27; 2:1, 5, 19, 24, 29; 3:1, 3, 9, 14; 4:1, 2, 4, 7, 10, 13, 19, 21 వచనములలో కనబడును. విశ్వాసులు మరియు క్రీస్తుతో కలిగియున్న సన్నిహితమైన సంబంధము అనే ఆలోచనను వ్యక్తపరచుట పౌలు ఉద్దేశ్యమైయుండెను. ఈ విధమైన పదాలకు సంబంధించిన మరిన్ని వివరములకొరకు రోమీయులకు వ్రాసిన పత్రిక ఉపోద్ఘాతమును చూడండి.

ఫిలిప్పీ పత్రికలోని వాక్య భాగాలలో ఉన్నటువంటి క్లిష్టమైన సంగతులు ఏవి?

  • కొన్ని తర్జుమాలలో ఆఖరి వచనము తరువాత “ఆమెన్” అని చేర్చబడియున్నది (4:23). యుఎల్టి, యుఎస్టి మరియు అనేక ఆదునిక తర్జుమాలలో అలా ఉండదు. ఒకవేళ “ఆమెన్” అని చేర్చబడియుంటే, అది బహుశః ఫిలిప్పీ పత్రిక మూలములో లేకపోయియుండవచ్చని సూచించడానికి దానిని చదరపు బ్రాకెట్లలో ([]) ఉంచాలి.

(చూడండి: rc://*/ta/man/translate/translate-textvariants)