te_tn_old/php/03/intro.md

2.8 KiB

ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక 03 సాధారణ అంశములు

విభజన మరియు క్రమము

4-8 వచనములలో నీతిమంతుడైన యూదునికి ఉండవలసిన లక్షణాలను పౌలు పట్టిక చేసియున్నాడు. పౌలు ప్రతి విధముగా యూదులకు మాదరిగా ఉన్నాడు. అయితే దీనికి భిన్నంగా క్రీస్తును తెలుసుకున్న దానిని గొప్పగా ఎంచియున్నాడు. (చూడండి: rc://*/tw/dict/bible/kt/righteous)

ఈ అధ్యాయములోని విశేషమైన అంశములు

కుక్కలు

ప్రాచిన తూర్పు ప్రాంత ప్రజలు మనుష్యలను అననుకూల పద్దతిలో సూచించడానికి కుక్క అనే చిత్రమును వాడేవారు. అన్ని సాంప్రదాయాల్లో “కుక్క” అనే పదమును ఈ రీతిగా వాడలేదు.

పునరుత్థానమైన శరీరములు

పరలోకములో ప్రజలు ఎలా ఉంటారని మనకు చాల తక్కువుగా తెలుసు. క్రైస్తవులు ఒక విధమైన మహిమ శరీరమును పొందుకుంటారని మరియు పాపము నుండి విముక్తులైయుంటారని పౌలు ఇక్కడ బోధించుచున్నాడు. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/heaven]] మరియు [[rc:///tw/dict/bible/kt/sin]])

ఈ అధ్యాయములోని ప్రాముఖ్యమైన అలంకార పదములు

బహుమానము

క్రైస్తవ జీవితమును గూర్చి వివరించుటకు పౌలు వివరణాత్మకమైన ఉదాహరణను ఉపయోగించుచున్నాడు. ఒక వ్యక్తి చనిపోవునంతవరకు క్రీస్తువలె జీవించుటకు ప్రయత్నం చేయుటయే క్రైస్తవ జీవిత గురియైయున్నది. ఈ గురిని మనము ఎన్నటికిని పరిపక్వతతో చేరలేము అయితే మనము దాని కొరకు ప్రయాసపడాలి.