te_tn_old/phm/front/intro.md

6.7 KiB

ఫిలేమోనుకు వ్రాసిన పత్రిక పరిచయం

భాగం 1: సహజమైన పరిచయము

ఫిలేమోను పత్రిక యొక్క విభజన

  1. ఫిలేమోనుకు పౌలు తెలియజేయు శుభములు (1:1-3)
  2. ఒనేసిము గూర్చి పౌలు ఫిలేమోనుకు చేయు వేడుకోలు (1:4-21)
  3. ముగింపు (1:22-25)

ఫిలేమోనుకు వ్రాసిన పత్రికను ఎవరు వ్రాసారు?

పౌలు ఫిలేమోనుకు వ్రాసిన పత్రికను వ్రాసాడు. పౌలు తర్షిషు పట్టణస్తుడైయుండెను. ప్రారంభ జీవితములో అతనిని సౌలు అని పిలిచేవారు. అతడు క్రైస్తవుడు కాక మునుపు పౌలు పరిసయ్యుడైయుండెను. అతడు క్రైస్తవులను హింసించెను. అతడు క్రైస్తవుడైన తరువాత, రోమా సామ్రాజ్యమంత తిరిగి యేసుని గూర్చి ప్రజలకు ప్రకటించాడు.

పౌలు ఈ పత్రికను వ్రాసినప్పుడు చెరసాలలో ఉండెను,

ఫిలేమోను పత్రిక దేని గూర్చి వ్రాయబడియున్నది?

పౌలు ఈ పత్రికను ఫిలేమోను అనే ఒక వ్యక్తికి వ్రాసాడు. ఫిలేమోను కొలస్సి పట్టణములో నివసించుచున్న ఒక క్రైస్తవుడైయుండెను. అతడు ఒనేసిము అనే బానిసను స్వంతము చేసుకొనియుండెను. ఒనేసిము ఫిలేమోను దగ్గర నుండి బహుశః దేనినో దొంగలించి పారిపోయియుండెను. ఒనేసిము రోమా పట్టణముకు వెళ్లి చెరసాలలో ఉన్న పౌలును దర్శించెను.

ఒనేసిమును తిరిగి పంపించుచున్నానని పౌలు ఫిలేమోనుకు చెప్పాడు. రోమా చట్ట ప్రకారము ఒనేసిమును శిక్షించుటకు ఫిలేమోను హక్కు కలిగియుండెను. అయితే ఒనేసిమును క్రైస్తవ సహోదరుని వలె తిరిగి స్వీకరించాలని పౌలు ఫిలేమోనుకు చెప్పాడు. ఒనేసిము తిరిగి వెళ్లి చెరసాలలో ఉన్న పౌలుకు ఉపచారము చేయునట్లు అతనికి అనుమతి ఇవ్వాలని పౌలు ఫిలేమోనుకు సలహా ఇచ్చుచున్నాడు.

ఈ పుస్తకము యొక్క శీర్షికను ఎలా తర్జుమా చేయాలి?

అనువాదకులు ఈ పుస్తకము యొక్క సంప్రదాయక పేరుతొ “ఫిలేమోను” అని పిలవవచ్చు. లేక వారు “ఫిలేమోనుకు పౌలు వ్రాసిన పత్రిక” అని లేక “పౌలు ఫిలేమోనుకు వ్రాసిన పత్రిక” అని స్పష్టమైన పేర్లను ఉపయోగించవచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

భాగం 2: భక్తిపరమైన మరియు సంస్కృతికపరమైన ప్రాముఖ్య విషయాలు

ఈ పత్రిక బానిసత్వమును అంగీకరించుచున్నదా?

పౌలు ఒనేసిమును తన మొదటి యజమానుని దగ్గరకు తిరిగి పంపాడు. అయితే బానిసత్వము అంగీకరించ తగ్గ చర్యగా పౌలు భావించలేదు. దానికిబదులుగా, దేవునికి పరిచర్య చేయు ప్రజలు, వారు ఏ పరిస్థితిలోవున్నా, పౌలు వారి విషయములో ఎక్కువ ఆసక్తికలిగియుండెను.

“క్రీస్తులో”, “ప్రభువులో” ఇతర పదములను ఉపయోగించుటలో పౌలు ఉద్దేశ్యము ఏమైయుండెను?

క్రీస్తు మరియు విశ్వాసుల మధ్యలో ఉన్న అతి దగ్గర సంబంధమును వ్యక్తపరచడానికి పౌలు ఈ మాటలను ఉపయోగించుచున్నాడు. ఈ విధమైన మాటలను గూర్చి ఎక్కువగా తెలుసుకోవడానికి రోమా పత్రిక యొక్క పరిచయ వాక్కులను చూడండి.

భాగం 3: ప్రాముఖ్యమైన తర్జుమా ఇబ్బందులు

ఏకవచనం మరియు బహువచనం “నీవు”

ఈ పుస్తకములో, “నేను” అనే పదము పౌలును సూచించుచున్నది. “నీవు” అనే పదము ఎక్కువ మార్లు ఏకవచనంగా ఉపయోగించబడియున్నది మరియు అది ఫిలేమోనును సూచించుచున్నది. దీనికి మినహాయింపుగా 1:22 మరియు 1:25 వచనాలున్నాయి. అక్కడ “మీరు” అనే పదము ఫిలేమోను మరియు అతని ఇంటిలో కలుసుకొను విశ్వాసులను సూచించుచున్నది. (చూడండి: [[rc:///ta/man/translate/figs-exclusive]] మరియు [[rc:///ta/man/translate/figs-you]])